SRH vs RCB, IPL 2023: ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై బెంగళూరు ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ సెంచరీకి తోడు డుప్లెసిస్ కూడా రాణించడంతో సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది బెంగళూరు. దీంతో బెంగళూరు ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపడ్డాయి. ముంబయిని వెనక్కి నెట్టి టాప్-4కు దూసుకెళ్లింది.
క్లాసెన్ క్లాసిక్ సెంచరీ
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా సాగింది. కేవలం నాలుగు ఓవర్లో 27 పరుగుల చేసింది. అయిదో ఓవర్లో ఓపెనర్లు అభిషేక్‌శర్మ , రాహుల్ త్రిపాఠిని బ్రేస్ వెల్ ఔట్ చేశాడు. బెంగళూరుకు ఆ అనందం ఎంతసేపు నిలవలేదు. తర్వాత నుంచే క్లాసెన్ జోరు మెుదలైంది. కెప్టెన్ మార్క్రమ్ (18; 20 బంతుల్లో) ఓ పక్క తడబడుతున్నా.. మరోవైపు క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దీంతో క్లాసెన్ 24 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. మార్క్రమ్ ఔట్ అవ్వడంతో క్రీజులోకి వచ్చిన హ్యారీ బ్రూక్ కూడా రాణించాడు. మరోవైపు క్లాసెన్ ఐపీఎల్ కెరీర్లో తొలి సెంచరీ (49 బంతుల్లో) నమోదు చేశాడు. ఈ సీజన్లో సన్‌రైజర్స్ తరఫున ఇది రెండో సెంచరీ. సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయి 186 పరుగులు చేసింది.
ఓ వైపు కోహ్లీ.. మరోవైపు డుప్లెసిస్
ఛేజింగ్ ప్రారంభించిన బెంగళూరు మెుదట నుంచి దూకుడుగా ఆడింది. డుప్లెసిస్, విరాట్ కోహ్లి పోటీపడి పరుగులు సాధించారు. పవర్ ప్లేలో బెంగళూరు వికెట్ కోల్పోకుండా 64 పరుగులు చేసింది. వీరిద్దరూ ఫోర్లు, సిక్సర్లు బాదడంతో కొండంత లక్ష్యం కరుగుతూ వచ్చింది. కోహ్లి (100; 63 బంతుల్లో 12×4, 4×6) శతకం సాధించగా.. డుప్లెసిస్ (71; 47 బంతుల్లో 7×4, 2×6) మంచి ఇన్నింగ్స్ ఆడాడు. వీరు అద్భుతంగా ఆడటంతో బెంగళూరు 19.2 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రెండు జట్ల తరఫున సెంచరీలు నమోదవడం ఐపీఎల్ చరిత్రలో ఇదే మెుదటిసారి. ఈ శతకంతో గేల్ పేరిట ఉన్న 6 సెంచరీల రికార్డును కోహ్లీ సమం చేసినట్లయింది.
Also read: IPL Records: ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు ఐదు వికెట్లు తీసిన టాప్-5 ప్లేయర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.