Shubman Gill IPL Record: శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు.. క్రికెట్‌ చరిత్రలో 'ఒకే ఒక్కడు'!

Gujarat Titans batter Shubman Gill Creates Unique IPL Record. టీమిండియా యువ బ్యాటర్, గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్ శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : May 17, 2023, 02:56 PM IST
Shubman Gill IPL Record: శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు.. క్రికెట్‌ చరిత్రలో 'ఒకే ఒక్కడు'!

Gujarat Titans batter Shubman Gill Creates Unique IPL Record: టీమిండియా యువ బ్యాటర్, గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్ శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో టెస్టు, వన్డే, టీ20 మరియు ఐపీఎల్‌లో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా గిల్‌ రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్‌ 2023లో భాగంగా సోమవారం అహ్మదాబాద్‌ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్ గిల్ సెంచరీ (101; 58 బంతుల్లో 13×4, 1×6) చేసిన విషయం తెలిసిందే. ఈ సెంచరీతో గిల్‌ ఈ అరుదైన ఘనత సాధించిన  'ఒకే ఒక్కడు'గా నిలిచాడు. 

2023 ఆరంభంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీ చేశాడు. ఆపై అహ్మదాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20లో కూడా శతకం బాదాడు. మరోవైపు అహ్మదాబాద్‌లోనే ఆస్ట్రేలియాపై టెస్టుల్లో సెంచరీ సాధించాడు. దీంతో ఒక క్యాలెండర్ ఇయర్‌లో మూడు ఫార్మాట్‌లో సెంచరీ మార్క్‌ అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. తాజాగా ఐపీఎల్‌ 2023లో కూడా గిల్‌ సెంచరీ చేసి.. ఇపటివరకు ఎవరూ నెలకొల్పని రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. 

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌, గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ శుబ్‌మన్‌ గిల్ ఆల్‌టైమ్ రికార్డ్ నెలకొల్పారు. ఐపీఎల్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీ, 5 వికెట్లు తీసిన మొదటి ప్రత్యర్థి జోడీగా వీరిద్దరూ నిలిచారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కర్ణాటకకు చెందిన కరుణ్ నాయర్ (111) సెంచరీ చేయగా.. తమిళనాడు తరఫున  అతిశయరాజ్ డేవిడ్‌సన్ (5/30) 5 వికెట్స్ పడగొట్టాడు. బెల్జియం మరియు ఆస్ట్రియా మధ్య జరిగిన టీ20 ఇంటర్నేషనల్ గేమ్‌లో ఇదే జరిగింది. బెల్జియంకు చెందిన సాబెర్ జఖిల్ (100 నాటౌట్) చేయగా.. ఆస్ట్రియాకు చెందిన అకిబ్ ఇక్బాల్ (5/5) 5 వికెట్స్ తీశాడు.

శుబ్‌మన్‌ గిల్‌కు ఐపీఎల్‌లో ఇదే మొదటి సెంచరీ. ఇక ఐపీఎల్‌లో రెండో సీజన్ ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఇది తొలి సెంచరీ కావడం విశేషం. ఐపీఎల్ 2023లో 13 మ్యాచులు ఆడిన గిల్ 576 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ ఉంది. ఇక ఐపీఎల్‌లో గుజరాత్ తరఫున 29 మ్యాచులు ఆడిన గిల్.. 1,059 పరుగులు చేశాడు. సగటు 40.73గా ఉండగా.. స్ట్రైక్ రేట్   139.53గా ఉంది. ఇందులో 8 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉంది. 

Also Read: Karnataka CM Siddaramaiah: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య.. రేపు ప్రమాణ స్వీకారం! శివకుమార్‌ మైనస్ అదే  

Also Read: Eshanya Maheshwari Hot Pics: ఇశన్య మహేశ్వరి భారీ అందాలు.. ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టిల్స్‌తో చంపేస్తుందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News