IPL 2023 Final: చెన్నైతో ఫైనల్లో తలపడే జట్టు ఇదే.. ఆర్ అశ్విన్ జోస్యం!

R Ashwin Predicts IPL 2023 Final Teams. ఐపీఎల్ 2023 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడతుందని ఆర్ అశ్విన్‌ జోస్యం చెప్పాడు.  

Written by - P Sampath Kumar | Last Updated : May 24, 2023, 01:55 PM IST
IPL 2023 Final: చెన్నైతో ఫైనల్లో తలపడే జట్టు ఇదే.. ఆర్ అశ్విన్ జోస్యం!

R Ashwin Says Chennai Super Kings and Mumbai Indians to play IPL 2023 Final Match: ఐపీఎల్‌ 2023 క్వాలిఫియర్‌-1లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. మంగళవారం చెపాక్‌ వేదికగా జరిగిన క్వాలిఫియర్‌-1లో 15 పరుగుల తేడాతో గుజరాత్‌ టైటాన్స్ జట్టును ఓడించింది. ఈ విజయంతో 10వ సారి ఐపీఎల్ ఫైనల్‌కు చెన్నై చేరుకుంది. ఇక మే 28న అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న ఫైనల్‌ మ్యాచ్ కోసం సన్నద్ధమవుతోంది. ఐపీఎల్ 2023 ఫైనల్‌ పోరులో చెన్నైతో లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్‌ టైటాన్స్‌లలో ఒకటి తలపడే అవకాశం ఉంది. ఫైనల్ మ్యాచుపై అందరూ తమ జోస్యం చెబుతున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెన్నైతో తలపడే జట్టును అంచనా వేశాడు. 

ఐపీఎల్ 2023 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడతుందని ఆర్ అశ్విన్‌ జోస్యం చెప్పాడు. ఈ మేరకు అశ్విన్‌ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. 'నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ 2023 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇం‍డియన్స్‌ తలపడనుంది' అని అశ్విన్ పేర్కొన్నాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ చూసిన ముంబై ఇండియన్స్ ఫాన్స్ తెగ సంతోషిస్తున్నారు. 

ఐపీఎల్ 2023 ఆరంభంలో ముంబై ఇండియన్స్ తడబడన విషయం తెలిసిందే. లీగ్ ఆరంభంలో వరుస పరాజయాలను ఎదుర్కొన్న రోహిత్ సేన.. సెకెండ్‌ హాఫ్‌ సీజన్‌లో మాత్రం చెలరేగి ఆడుతోంది. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ. సూర్యకుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్ ఫామ్ అందుకోవడంతో వరుస మ్యాచ్‌ల్లో విజయం సాధించి.. ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. మరోవైపు తమ చివరి మ్యాచులో బెంగళూరు ఓడడం కూడా ముంబైకి కలిసొచ్చింది. ఒకవేళ బెంగళూరు గెలిచుంటే ముంబై ఇంటిదారి పట్టేది. 

మే 24న చెపాక్‌ వేదికగా ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ముంబై ఆటగాళ్ల ఫామ్ కారణంగా లక్నోకు గట్టి పోటీ ఎదురుకానుంది. ఒక వేళ ఈ మ్యాచ్‌లో ముంబై విజయం సాధిస్తే క్వాలిఫియర్‌-2లో ఆడుతుంది. క్వాలిఫియర్‌-2లో గుజరాత్‌తో తలపడుతుంది. అక్కడ గెలిస్తే చెన్నైతో ఫైనల్ ఆడుతుంది. చెన్నైతో తలపడాలంటే ముంబై రెండు మ్యాచులు గెలవాల్సి ఉంది. 

Also Read: Hansika Comments: ఆ హీరో వెంటపడ్డాడు.. సరైన బుద్ధి చెప్పా.. హన్సిక సంచలనం!

Also Read: IPL 2023 Updates: క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్‌పై విజయం, ఐపీఎల్ ఫైనల్‌కు చెన్నై

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook.

 

Trending News