MI Vs PBKS IPL 2023 Highlights: పంజాబ్ కింగ్స్ చేతిలో ముంబై ఇండియన్స్ అనూహ్య ఓటమిని చవిచూసింది. ఆఖరి ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ముంబై ఓటమిపాలైంది. టాస్ ఓడి పంజాబ్ మొదట బ్యాటింగ్ చేయగా.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 రన్స్ చేసింది. లక్ష్య ఛేదనలో ముంబై 201 పరుగులకు ఆలౌటైంది. దీంతో 13 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇక ఈ మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఐపీఎల్‌లో మూడో మ్యాచ్ ఆడుతున్న అర్జున్.. ఒకే ఓవర్లో 31 పరుగులు సమర్పించుకున్నాడు. ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన బౌలర్ల జాబితాలో ఆరోస్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసిన అర్జున్.. 48 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.
పంజాబ్ ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్‌లో అర్జున్‌కు బంతి అప్పగించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. అప్పటికీ పంజాబ్ స్కోరు 149-4. స్టైకింగ్‌లో పంజాబ్ కెప్టెన్ సామ్ కర్రన్ ఉన్నాడు. టోర్నీలో ఇప్పటివరకు పెద్దగా ఆకట్టుకోని కర్రన్.. అర్జున్ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్ కొట్టాడు. తొలి బంతికి సిక్సర్ బాదాడు. తరువాత వైడ్ వేయగా.. రెండో బాల్‌ను బౌండరీకి తరలించాడు. మూడో బంతికి సింగిల్ రాగా.. తరువాత హర్‌ప్రీత్ సింగ్ చుక్కలు చూపించాడు.
నాలుగో బంతికి ఫోర్, ఐదో బంతికి సిక్సర్ కొట్టాడు. చివరి బంతిని నోబాల్ వేయగా.. హర్‌ప్రీత్ సింగ్ ఫోర్ కొట్టాడు. తరువాత ఫ్రీహిట్ కూడా ఫోర్ బాదాడు. దీంతో ఈ ఓవర్‌లో మొత్తం 31 రన్స్ వచ్చాయి. తొలి రెండు ఓవర్లలో 17 పరుగులు ఇవ్వగా.. మూడో ఓవర్‌లో మాత్రం 31 పరుగులు సమర్పించుకున్నాడు.
Also Read: PM Modi Schedule: ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు.. 36 గంటల్లో 5,300 కి.మీ ప్రయాణం
ఐపీఎల్ చరిత్రలో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్లలో ప్రశాంత్ పరమేశ్వరన్ (కొచ్చి టస్కర్స్) మొదటి ప్లేస్‌లో ఉన్నాడు. 2011 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ రెచ్చిపోయాడు. ప్రశాంత్ పరమేశ్వరన్ వేసిన ఒక ఓవర్లో 4 సిక్సర్లు, 3 ఫోర్లు బాది.. మొత్తం 37 పరుగులు పిండుకున్నాడు. ఆ తరువాత స్థానంలో హర్షల్ పటేల్ ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 37 రన్స్ బాదాడు. ఇందులో 5 సిక్సర్లు, ఒక ఫోర్‌తో హర్షల్ పటేలో ఓవర్‌లో 37 పరుగులు రాబట్టాడు. డేనియల్ సామ్స్ 35 పరుగులు, పర్వీందర్ అవానా 33, రవి బొపారా 33, ఈ సీజన్‌లో యష్ దయాళ్, అర్జున్ టెండూల్కర్ 31 రన్స్‌తో సమానంగా నిలిచారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి