Ravi Shastri Feels Hardik Pandyas Gujarat Titans to win IPL 2023 Title: ఐపీఎల్ 2023 మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. దాదాపుగా ప్రతి మ్యాచ్ ఉత్కంఠతకు గురిచేస్తోంది. చిబారి బంతి, చివరి ఓవర్ వరకు మ్యాచ్ సాగుతుండడంతో ఫాన్స్ కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే ఐపీఎల్ 2023లో సగానికి పైగా మ్యాచులు పూర్తయ్యాయి. కొన్ని టీమ్స్ 9 మ్యాచులు ఆడగా.. ఇంకొన్ని టీమ్స్ 10 మ్యాచ్‌లు ఆడేశాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పోటీ తీవ్రంగా ఉంది. అన్ని జట్లకు ప్లే ఆఫ్స్ వెళ్లే అవకాశం ఉంది. అయితే లీగ్ దశ ముగిసేలోపు తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్ వెలుతాయి. దాంతో నెట్ రన్‌రేట్ కూడా కీలకంగా మారుతుంది.
ఐపీఎల్ 2023కి సమయం దగ్గరపడుతుండడంతో టైటిల్ ఎవరు గెలుస్తారో అని మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. టీమిండియా మాజీ హెడ్ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి ఐపీఎల్ 2023 గెలిచే జట్టును అంచనా వేశాడు. గుజరాత్ టైటాన్స్ మరోసారి ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలుస్తుందని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఏడాదిలోనే గుజరాత్ ప్రాంచైజీ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. గుజరాత్ జట్టులో మంచి సమతూకం ఉందని, విజయాల కోసం సమష్టిగా రాణిస్తున్నారని.. అందుకే ఈ సారి కూడా టైటిల్ ఫేవరెట్‌గా గుజరాతే నిలుస్తోందని రవిశాస్త్రి జోస్యం చెప్పాడు.
ఓ క్రీడా ఛానల్‌తో రవిశాస్త్రి మాట్లాడుతూ... 'ఐపీఎల్ 16వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ ఆడుతున్న తీరు బాగుంది. పాయింట్ల పట్టికలో గుజరాత్ జట్టు ఉన్న స్థితిని చూస్తే.. ఆ జట్టే టైటిల్ విజేతగా నిలుస్తుందని నేను అనుకుంటున్నా. గుజరాత్ జట్టులో మంచి స్థిరత్వం ఉంది. 7-8 మంది ఆటగాళ్లు నిలకడగా రాణిస్తున్నారు. ఒకరికొకరు అండగా నిలుస్తున్నారు. అందువల్లే విజయాలు దక్కుతున్నాయి' అని అన్నాడు. ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ ప్రస్తుతం అగ్ర స్థానంలో ఉంది. ఆడిన 9 మ్యాచులలో 6 విజయాలు సాధించి 12 పాయింట్స్ ఖాతాలో వేసుకుంది.
రాజస్థాన్ రాయల్స్ జట్టును సంజూ శాంసన్ నడిపిస్తున్న తీరుపై కూడా టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. ‘కెప్టెన్‌గా సంజూ ఎంతో పరిణతి సాధించాడు. స్పిన్నర్లను చాలా బాగా ఉపయోగించుకుంటున్నాడు. మంచి కెప్టెన్ మాత్రమే ముగ్గురు స్పిన్నర్లతో మ్యాచ్ ఆడగలడు. అంతేకాదు వారిని తెలివిగా ఉపయోగించుకోగలడు’ అని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. ఆడిన 9 మ్యాచులలో 5 విజయాలు సాధించి 10 పాయింట్స్ ఖాతాలో వేసుకుంది. లక్నో, చెన్నై జట్లు వరుసగా 2,3 స్థానాల్లో ఉన్నాయి.
Also Read: Google Pixel Fold: గూగుల్ నుంచి తొలి ఫోల్డబుల్ ఫోన్.. డిజైన్, స్పెసిఫికేషన్ వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.