IPL 2023: ఐపీఎల్‌లో అత్యధికంగా సంపాదించిన టాప్-5 ఆటగాళ్లు వీళ్లే..!

IPL Top Earning Players: అభిమానులను ఉర్రూతలూగించేందుకు ఐపీఎల్ రెడీ అవుతోంది. శుక్రవారం నుంచి చెన్నై-గుజరాత్ జట్ల మధ్య పోరుతో టైటిల్ వేట ప్రారంభకానుంది. ఈసారి జట్టు టైటిల్ గెలుస్తుంది..? ఎవరు ఎలా ఆడతారు..? అని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 30, 2023, 11:21 AM IST
IPL 2023: ఐపీఎల్‌లో అత్యధికంగా సంపాదించిన టాప్-5 ఆటగాళ్లు వీళ్లే..!

IPL Top Earning Players: ఐపీఎల్ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి అసలు సమరం ఆరంభం కానుంది. 10 జట్లు ఛాంపియన్‌లుగా నిలిచేందుకు రేసులో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. 2008లో ప్రారంభమైన ఐపీఎల్.. ఎందరో అనామక ప్లేయర్లను సూపర్ స్టార్‌లుగా మార్చింది. ప్రపంచలోనే అత్యంత క్రేజ్ ఉన్న ఐపీఎల్ ద్వారా ఎంతో మంది ఆటగాళ్లు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిపోయారు. ఐపీఎల్ నుంచి అత్యధికంగా సంపాదిస్తున్న టాప్ 5 ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం..

1.రోహిత్ శర్మ (రూ.178 కోట్లు)
ఐపీఎల్‌లో సంపాదిస్తున్న ఆటగాళ్లలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో రోహిత్ ఇప్పటివరకు దాదాపు రూ.178 కోట్లు సంపాదించాడు. 2008లో రూ.3 కోట్లకు అమ్ముడుపోయిన రోహిత్ శర్మ.. ప్రస్తుతం ఏడాదికి రూ.16 కోట్లు అందుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ కంటే హిట్‌మ్యాన్ ఎక్కువగా అర్జిస్తున్నాడు. 

     ఏడాది     అందుకున్న పారితోషికం
==> 2008        3 కోట్లు
==> 2009        3 కోట్లు
==> 2010        3 కోట్లు
==> 2011        9.2 కోట్లు
==> 2012        9.2 కోట్లు
==> 2013        9.2 కోట్లు
==> 2014        12.5 కోట్లు
==> 2015        12.5 కోట్లు
==> 2016        12.5 కోట్లు
==> 2017        12.5 కోట్లు
==> 2018        15 కోట్లు
==> 2019        15 కోట్లు
==> 2020        15 కోట్లు
==> 2021        15 కోట్లు
==> 2022        16 కోట్లు
==> 2023        16 కోట్లు
    మొత్తం    178.6 కోట్లు

2.మహేంద్ర సింగ్ ధోని (176 కోట్లు)
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మొదటి సీజన్‌లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. ఆ సీజన్‌లో ధోనీ పారితోషికం రూ.6 కోట్లు కాగా.. ప్రస్తుతం రూ.12 కోట్లు అందుకున్నాడు. 2018 నుంచి 2021 వరకు ధోనీ జీతం రూ.15 కోట్లుగా ఉంది. ఐపీఎల్‌ ద్వారా ధోనీ సంపాదనలో రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు దాదాపు రూ.176 కోట్లు సంపాదించాడు.

      ఏడాది        అందుకున్న పారితోషికం
==> 2008        6 కోట్లు
==> 2009        6 కోట్లు
==> 2010        6 కోట్లు
==> 2011        8.28 కోట్లు
==> 2012        8.28 కోట్లు
==> 2013        8.28 కోట్లు
==> 2014        12.5 కోట్లు
==> 2015        12.5 కోట్లు
==> 2016        12.5 కోట్లు
==> 2017        12.5 కోట్లు
==> 2018        15 కోట్లు
==> 2019        15 కోట్లు
==> 2020        15 కోట్లు
==> 2021        15 కోట్లు
==> 2022        12 కోట్లు
==> 2023        12 కోట్లు
   మొత్తం        176.84 కోట్లు

3.విరాట్ కోహ్లీ (173 కోట్లు)

ఐపీఎల్ ద్వారా అత్యధికంగా సంపాదించిన ఆటగాళ్ల ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు. ఐపీఎల్ నుంచి ఇప్పటివరకు రూ.173 కోట్లు జీతంగా అందుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు 5 సెంచరీలు, 44 అర్ధ సెంచరీల సాయంతో మొత్తం 6624 పరుగులు చేశాడు.

      ఏడాది      అందుకున్న పారితోషికం
==> 2008        1.2 మిలియన్లు
==> 2009        1.2 మిలియన్లు
==> 2010        1.2 మిలియన్లు
==> 2011        8.28 కోట్లు
==> 2012        8.28 కోట్లు
==> 2013        8.28 కోట్లు
==> 2014        12.5 కోట్లు
==> 2015        12.5 కోట్లు
==> 2016        12.5 కోట్లు
==> 2017        12.5 కోట్లు
==> 2018        17 కోట్లు
==> 2019        17 కోట్లు
==> 2020        17 కోట్లు
==> 2021        17 కోట్లు
==> 2022        15 కోట్లు
==> 2023        15 కోట్లు
   మొత్తం        173.2 కోట్లు
4.సురేష్ రైనా (రూ.110 కోట్లు)

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఒంటి చెత్తో ఎన్నో విజయాలు అందించాడు సురేశ్ రైనా. తన ఆటతీరుతో మిస్టర్ ఐపీఎల్‌గా పేరు సంపాదించుకున్నాడు. మొత్తం ఐపీఎల్ కెరీర్‌లో ఒక సెంచరీతోపాటు 39 హాఫ్ సెంచరీలు చేశాడు. ప్రస్తుతం ఈ క్యాష్‌ లీగ్‌కు గుడ్ బై చెప్పిన రైనా.. ఇప్పటి వరకు రూ.110 కోట్లు జీతం అందుకున్నాడు.

    ఏడాది        అందుకున్న పారితోషికం
==> 2008        2.6 కోట్లు
==> 2009        2.6 కోట్లు
==> 2010        2.6 కోట్లు
==> 2011        5.98 కోట్లు
==> 2012        5.98 కోట్లు
==> 2013        5.98 కోట్లు
==> 2014        9.5 కోట్లు
==> 2015        9.5 కోట్లు
==> 2016        9.5 కోట్లు
==> 2017        12.5 కోట్లు
==> 2018        11 కోట్లు
==> 2019        11 కోట్లు
==> 2020        11 కోట్లు
==> 2021        11 కోట్లు
    మొత్తం        110.74 కోట్లు

5.రవీంద్ర జడేజా (109 కోట్లు)

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌ తన ఆటతీరుతో అభిమానులను ఊర్రతలూగించాడు. ఐపీఎల్‌లో సంపాదన విషయంలో సురేశ్ రైనా వెనుక రవీంద్ర జడేజా ఉన్నాడు. తొలి సీజన్‌లో రూ.12 లక్షలకు అమ్ముడుపోయిన రవీంద్ర జడేజా.. ప్రస్తుతం రూ.16 కోట్ల వేతనంతో అందుకున్నాడు. ఈ సీజన్‌లో అత్యధిక పారితోషికం అందుకున్న ఆటగాళ్ల జాబితాలో జడ్డూ భాయ్ ఒకడు. ఐపీఎల్ ద్వారా ఇప్పటివరకు రూ.109 కోట్లు సంపాదించాడు జడేజా.

     ఏడాది        అందుకున్న పారితోషికం
==> 2008        1.2 మిలియన్లు
==> 2009        1.2 మిలియన్లు
==> 2010        4.37 కోట్లు
==> 2012        9.2 కోట్లు
==> 2013        9.2 కోట్లు
==> 2014        5.5 కోట్లు
==> 2015        5.5 కోట్లు
==> 2016        5.5 కోట్లు
==> 2017        9.5 కోట్లు
==> 2018        7 కోట్లు
==> 2019        7 కోట్లు
==> 2020        7 కోట్లు
==> 2021        7 కోట్లు
==> 2022        16 కోట్లు
==> 2023        16 కోట్లు
   మొత్తం    109.01 కోట్లు

Also Read: Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్‌కు కూడా చేరదు.. మాజీ క్రికెటర్ జోస్యం

Also Read:  Coronavirus Cases Today: కరోనా అలర్ట్.. నేడు భారీగా కేసులు నమోదు   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News