GT vs LSG Playing 11: పాండ్యా బ్రదర్స్ ఫైట్.. టాస్ గెలిచిన లక్నో.. తుది జట్లు ఇవే..!

Gujarat Titans Vs Lucknow Super Giants Match Updates: ఐపీఎల్‌లో నేడు రెండు పటిష్టమైన జట్ల మధ్య బిగ్‌ ఫైట్ జరగబోతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు పోరుకు సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన లక్నో ఫీల్డింగ్ ఎంచుకుంది.   

Written by - Ashok Krindinti | Last Updated : May 7, 2023, 03:24 PM IST
GT vs LSG Playing 11: పాండ్యా బ్రదర్స్ ఫైట్.. టాస్ గెలిచిన లక్నో.. తుది జట్లు ఇవే..!

Gujarat Titans Vs Lucknow Super Giants Match Updates: ఐపీఎల్‌లో అన్నదమ్ములు కెప్టెన్లుగా తలపడుతున్నారు. కృనాల్ పాండ్యా, హార్ధిక్ పాండ్యా మధ్య పోరులో ఎవరు విజయం సాధిస్తారో ఆసక్తికరంగా మారింది. ఆదివారం గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. పాయింట్స్‌ టేబుల్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉన్న గుజరాత్.. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ దాదాపు కన్ఫార్మ్ అవుతుంది. లక్నో ఈ మ్యాచ్ గెలిస్తే పాయింట్ల పట్టికలో రెండో ప్లేస్‌కు చేరుకుంటుంది. లక్నో రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరం కావడంతో కృనాల్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కృనాల్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. రెండు జట్లు ఒక్కో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి.  

 

'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. విజయం సాధించాలనే లక్ష్యంతో ఇక్కడికి వచ్చాం. ఓవరాల్‌గా వికెట్ బాగుది. మాకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. లక్ష్యాన్ని ఛేజ్ చేయాలని అనుకుంటున్నాం. మేము మంచి క్రికెట్ ఆడాము. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మేము మంచి దశలో నిలిచాము. నవీన్ స్థానంలో డికాక్ తుది జట్టులోకి వచ్చాడు..' లక్నో కెప్టెన్ కృనాల్ పాండ్యా తెలిపాడు.

'మేం టాస్ గెలిస్తే.. బ్యాటింగ్ చేసి ఉండేవాళ్లం. అయినా నేను కోరుకున్నదే వచ్చింది. ఇది మాకు ఎమోషనల్ డే. మా నాన్న ఉంటే ఎంతో గర్వపడేవాడు. అన్నదమ్ములు కెప్టెన్లుగా ఆడుతుండడంతో మా కుటుంబం గర్వపడుతోంది. ఇద్దరిలో ఒక పాండ్యా ఈరోజు కచ్చితంగా గెలుస్తాడు. ఫలితం గురించి చింతించకూడదు. అపజయం భయం లోపలికి రావచ్చు. మేం మంచి క్రికెట్ ఆడతం. తుది జట్టులో తప్పనిసరిగా మార్పు చేయాల్సి వచ్చింది. జోష్‌ లిటిల్ ఐర్లాండ్ తరఫున ఆడేందుకు వెళ్లడంతో తుది జట్టు నుంచి తప్పుకున్నాడు. అల్జారీ జోసఫ్ ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి వచ్చాడు..' అని గుజరాత్ కెప్టెన్ హర్ధిక్ పాండ్యా అన్నాడు.

తుది జట్లు ఇలా..

లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, కరణ్ శర్మ, కృనాల్ పాండ్యా (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, స్వప్నిల్ సింగ్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, అవేశ్‌ ఖాన్
ఇంపాక్ట్ ప్లేయర్లు: ఆయుష్ బదోని, అమిత్ మిశ్రా, డేనియల్ సామ్స్, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్.

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ

ఇంపాక్ట్ ప్లేయర్లు: అల్జారీ జోసెఫ్, దాసున్ షనక, కేఎస్ భరత్, శివం మావి, జయంత్ యాదవ్.

Also Read: Virat Kohli Records: విరాట్ కోహ్లీ మరో రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో తొలి ప్లేయర్‌గా..

Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. డీఏ పెంపుపై క్లారిటీ  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News