CSK vs SRH: సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌.. ఎంఎస్ ధోనీ, అజింక్య రహానేలను ఊరుస్తున్న అరుదైన రికార్డులు!

MS Dhoni to break these ipl record in CSK vs SRH match. ఐపీఎల్‌ 16లో భాగంగా నేడు చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆటగాళ్లను కొన్ని రికార్డులు ఊరిస్తున్నాయి.  

Written by - P Sampath Kumar | Last Updated : Apr 21, 2023, 06:56 PM IST
CSK vs SRH: సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌.. ఎంఎస్ ధోనీ, అజింక్య రహానేలను ఊరుస్తున్న అరుదైన రికార్డులు!

MS Dhoni, Ajinkya Rahane and T Natarajan eye on rare ipl records in Today Match: ఐపీఎల్‌ 16లో భాగంగా నేడు చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు (CSK vs SRH ) తలపడనున్నాయి. చెన్నైలోని చెపాక్‌ మైదానంలో ఈ మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది. గత మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయంతో మంచి జోరుమీదున్న చెన్నై మరో విజయంపై కన్నేసింది. మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టుపై ఓడిన సన్‌రైజర్స్‌ ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలి చూస్తోంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌ మరో ఉత్కంఠ పోరుగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో ఆటగాళ్లను కొన్ని రికార్డులు ఊరిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

ఎంఎస్ ధోనీ:
ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన ఘనత సాధించే అవకాశం ఉంది.చెన్నై తరఫున 183 ఇన్నింగ్స్‌లు ఆడిన ధోనీ.. 40.5 సగటుతో 4463 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుతో జరిగే మ్యాచులో మరో 37 పరుగులు చేస్తే.. చెన్నై తరఫున 4500 పరుగుల చేస్తాడు. దాంతో ఈ మార్క్ అందుకున్న రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఇంతకుముందు మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా ఈ మైలురాయిని చేరుకున్నాడు. రైనా 4687 రన్స్ చేశాడు. రైనా రికార్డును అధిగమించే అవకాశం ధోనీ ముందుంది. 

అజింక్య రహానే:
చెన్నై సూపర్ కింగ్స్‌ బ్యాటర్ అజింక్య రహానే కూడా అరుదైన రికార్డు సాధించే అవకాశం ఉంది. జింక్స్ ఇప్పటివరకు 220 టీ20 ఇన్నింగ్స్‌లలో 5769 పరుగులు చేశాడు. ఇందులో 598 ఫోర్లు ఉన్నాయి. సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచులో మరో రెండు ఫోర్లు బాదితే..  టీ20 ఫార్మాట్‌లో 600 ఫోర్లు బాదిన ఎనిమిదో భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. మరోవైపు ఏడు బౌండరీలు బాదితే ఐపీఎల్లో 450 ఫోర్లు బాదిన ఏడో భారత బ్యాటర్‌గా రికార్డుల్లో నిలుస్తాడు. ప్రస్తుతం జింక్స్ మంచి ఫామ్ కనబర్చుతున్న విషయం తెలిసిందే. టాపార్డర్‌లో వచ్చి పరుగుల వరద పారిస్తున్నాడు.  

టీ నటరాజన్:
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో స్టార్ బౌలర్లలో టీ నటరాజన్ ఒకడు. ఇనింగ్స్ ఆరంభంలో, డెత్ ఓవర్లలో అద్భుతమైన యార్కర్లతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టగల సమర్ధుడు. అయితే ఇటీవలి కాలంలో నటరాజన్ పెద్దగా ప్రభావం చ్చుపలేకపోతున్నాడు. అయినా కూడా నట్టు అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు. ఇప్పటివరకు సన్‌రైజర్స్ తరఫున 34 మ్యాచులు ఆడిన నటరాజన్.. 40 వికెట్లు తీశాడు. చెన్నైపై రెండు వికెట్లు తీస్తే సన్‌రైజర్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా ఉన్న సందీప్ శర్మ (41) రికార్డును అధిగమిస్తాడు. 

Also Read: Samsung Galaxy S22 Price Drop: శాంసంగ్ గెలాక్సీ ఎస్22పై భారీ డిస్కౌంట్.. కొనడానికి ఎగబడుతున్న జనాలు! 22 వేలు సేఫ్  

Also Read: Tata Punch Sales 2023: కారు చిన్నదే అయినా.. జనాలు టాటా పంచ్‌నే ఎక్కువగా కొనుగోలు చేయడానికి 5 రీజన్స్ ఇవే!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News