IPL PBKS Vs DC: 'డూ ఆర్ డై మ్యాచ్‌'లో ఢిల్లీ గెలుపు... పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు...

IPL PBKS Vs DC Match: ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ పంజాబ్-ఢిల్లీ జట్ల మధ్య జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. దీంతో 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 17, 2022, 01:00 AM IST
  • ఐపీఎల్ లేటెస్ట్ అప్‌డేట్స్
  • డూ ఆర్ డై మ్యాచ్‌లో పంజాబ్‌పై ఢిల్లీ గెలుపు
  • పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపుగా గల్లంతు
IPL PBKS Vs DC: 'డూ ఆర్ డై మ్యాచ్‌'లో ఢిల్లీ గెలుపు... పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు...

IPL PBKS Vs DC Match: ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ చేతులెత్తేయగా ఢిల్లీ విజయం సాధించింది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన 'డూ ఆర్ డై' మ్యాచ్‌లో ఢిల్లీ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 159 పరుగులే చేసినప్పటికీ... బౌలర్లు అద్భుతంగా రాణించడంతో మరో విజయాన్ని నమోదు చేయగలిగింది. తాజా విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరి ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. 

ఢిల్లీ అలా బ్యాటింగ్ ప్రారంభించిందో లేదో... మొదటి ఓవర్ మొదటి బంతికే వార్నర్ వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ సర్ఫరాజ్ ఖాన్‌, మిచెల్ మార్షల్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ క్రమంలో మార్ష్ 48 బంతుల్లో 3 సిక్సులు, 4 ఫోర్లతో 63 పరుగులు బాది టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సర్ఫరాజ్ 32 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత లలిత్ యాదవ్ (24) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. పంజాబ్ బౌలర్లలో లివింగ్‌స్టోన్ 3 వికెట్లు, అర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీసి ఢిల్లీని తక్కువ స్కోర్‌కే కట్టడి చేయడంలో కీలకంగా వ్యవహరించారు.

160 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ జట్టు నాలుగో ఓవర్‌లో 38 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత నుంచి వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉంది. పంజాబ్ బ్యాట్స్‌మెన్‌లో జితేశ్ శర్మ (44) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేదు. ఫలితంగా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులే చేసింది. ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు తీసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో ఓటమితో పంజాబ్ ప్లేఆఫ్స్ అవకాశాలు గల్లంతయ్యాయి. ఇప్పటివరకూ 13 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు కేవలం ఆరింట మాత్రమే విజయం సాధించింది. పంజాబ్ తమ చివరి మ్యాచ్‌లో గెలిచినా కేవలం 14 పాయింట్లే లభిస్తాయి. ఇప్పటికే గుజరాత్‌ ప్లేఆఫ్స్ చేరుకోగా రాజస్తాన్, లక్నో బెర్తులు కూడా దాదాపుగా ఖరారయ్యాయి. మరో స్థానం కోసం ఢిల్లీ, బెంగళూరు జట్లు పోటీ పడుతున్నాయి.

Also Read: Women's T20 Challenge: మే 23 నుంచి మహిళల టీ20 ఛాలెంజ్.. మిథాలీ, ఝులన్‌కు నిరాశ!

Also Read: Nabha Natesh Saree Pics: కాటుక కళ్లతో మైమరిపిస్తున్న నభా నటేష్.. పల్లెటూరి వనితలా వయ్యారాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News