IPL 2024 Updates: ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్న ఆటగాళ్లు ఎవరో తెలుసా?

IPL 2024 Updates: ఐపీఎల్ 2024లో పర్పుల్ క్యాప్ రోజురోజుకూ చేతులు మారుతూ వస్తుంది. మెున్నటి వరకు తొలి స్థానంలో ఉన్న చాహల్ ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయాడు. బుమ్రా నంబర్ వన్ కిరీటం దక్కించుకున్నాడు.   

Written by - Samala Srinivas | Last Updated : Apr 19, 2024, 05:19 PM IST
IPL 2024 Updates: ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్న ఆటగాళ్లు ఎవరో తెలుసా?

IPL 2024, Top-5 Purple and orange Cap Holders: ఐపీఎల్ 17వ సీజన్ ఉత్కంఠ సాగుతోంది. జట్లన్నీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఓ పక్క బ్యాటర్లు దుమ్మురేపుతుంటే.. మరోపక్క బౌలర్లు అద్భుతాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో తొలి స్థానంలో ఎవరున్నారు, ఎక్కువ వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో మెుదటి స్థానం ఎవరు దక్కించుకున్నారో తెలుసుకుందాం. 

ఆరెంజ్ క్యాప్ రేసులో..
ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కింగ్ కోహ్లీ కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు ఏడు మ్యాచులు ఆడిన కోహ్లీ 361 పరుగులు చేశాడు. అతడి తర్వాత స్థానంలో రాజస్థాన్ ఫ్లేయర్ రియాన్ పరాగ్ ఉన్నాడు. పరాగ్ ఏడు మ్యాచుల్లో 318 పరుగులు చేసి రెండో స్థానంలో కొనసాగుతోంది. మూడో స్థానంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ ఏడు మ్యాచుల్లో 297 రన్స్ చేశాడు. కేకేఆర్ ఫ్లేయర్ సునీల్ నరైన్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. నరైన్ ఆరు మ్యాచుల్లో 276 పరుగులు చేశాడు. రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ఏడు మ్యాచుల్లో 276 చేసి ఐదో స్థానంలో నిలిచాడు. 

పర్పుల్ క్యాప్ రేసులో..
పంజాబ్ కింగ్స్‌పై మూడు వికెట్లు  తీయడం ద్వారా ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ బుమ్రా చాహల్ వెనక్కినెట్టి అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఈ యార్కర్ కింగ్ ఏడు మ్యాచ్‌ల్లో మొత్తం 13 వికెట్లు పడగొట్టాడు. ఇక రెండో స్థానంలో ఉన్న చాహల్ 7 మ్యాచ్‌లలో 12 వికెట్లను తీశాడు. మూడో స్థానంలో ముంబై బౌలర్ గెరాల్డ్ కోయెట్జీ కొనసాగుతున్నాడు. అతడు ఏడు మ్యాచుల్లో 12 వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్ 7 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీయడం ద్వారా నాలుగో స్థానం దక్కించుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌కు చెందిన కగిసో రబాడ ఏడు మ్యాచుల్లో 10 వికెట్లు తీసి ఐదో స్థానంలో నిలిచాడు. 

Also Read: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా జట్టు ఇదే.. వైరల్ అవుతున్న లిస్ట్..!

Also Read: IPL 2024: CSKకు బిగ్ షాక్.. సీజన్ మెుత్తానికి దూరమైన కాన్వే.. అతడి స్థానంలో ఎవరంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News