SRH Sentiment: ఆరెంజ్ ఆర్మీకు ఆసీస్ కెప్టెన్ల సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా

SRH Sentiment: ఐపీఎల్ 2024 సీజన్ 17 రసవత్తరంగా సాగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ చరిత్ర సృష్టించింది. బ్యాటర్ల విధ్వంసం చూస్తే అసలిది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టేనా అనే సందేహం రాకమానదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 31, 2024, 11:06 PM IST
SRH Sentiment: ఆరెంజ్ ఆర్మీకు ఆసీస్ కెప్టెన్ల సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా

SRH Captains: ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో గత కొద్దికాలంగా తీవ్రమైన పరాభవం ఎదుర్కొంటున్న జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. ముఖ్యంగా గత రెండు సీజన్లలో అయితే అట్టడుగున నిలిచింది. తరచూ కెప్టెన్సీ మార్చినా ప్రయోజనం లేకపోయింది. ఈసారి టీమ్‌లో భారీ ప్రక్షాళన చేసి, భారీ ధర వెచ్చించి ఆటగాళ్లను కొనుగోలు చేసి కొత్త జెర్సీతో సిద్ధమైంది. అందుకు తగ్గట్టే తొలి మ్యాచ్‌లో చివరి బంతికి ఓడినా రెండో మ్యాచ్‌లో రికార్డు స్థాయి స్కోరుతో చరిత్ర లిఖించింది. 

నిన్నటివరకూ ఏ మాత్రం హాట్ ఫేవరెట్‌గా లేని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలి రెండు మ్యాచ్‌లతో టైటిల్ ఫేవరెట్‌గా మారిపోయింది. జట్టులోని ప్రతి ఆటగాడి విధ్వంసకర బ్యాటింగ్ అందర్నీ ఆశ్చర్యపర్చింది. ముఖ్యంగా ట్రేవిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఎయిడెన్ మార్క్‌రమ్ ఆటతీరు చూస్తే ఏ బౌలర్‌కైనా చెమట్లు పట్టాల్సిందే. అత్యధికంగా 277 పరుగులు చేసి చరిత్ర సృష్టించింది. రెండు ఫాస్టెస్ట్ ఫిఫ్టీలు నమోదు చేసింది. వాస్తవానికి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్ చివరి బంతికి ఓడింది.  పోతుందనుకున్న మ్యాచ్ హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసకర బ్యాటింగుతో గెలుపు అంచువరకూ వచ్చింది. చివరి బంతికి దురదృష్ఠం వెంటాడి ఓడిపోవల్సివచ్చింది. రెండో మ్యాచ్ 5 సార్లు టైటిల్ గెల్చిన ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించింది. అత్యధిక స్కోరుతో రన్‌రేట్ భారీగా మెరుగుపర్చుకుంది. 

నిన్న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రేవిస్ హెడ్ 24 బంతుల్లో 62, అభిషేక్ శర్మ 23 బంతుల్లో 63, హెన్రిచ్ క్లాసెన్ 34 బంతుల్లో 80, మార్క్‌రమ్ 28 బంతుల్లో 42 పరుగులతో విధ్వంసం అంటే ఏంటో చూపించారు. హెన్రిచ్ క్లాసెన్ వరుసగా రెండో మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. బౌలింగ్ విభాగంలో లైన్ అండ్ లెంగ్త్‌పై దృష్టి సారించగలిగితే ఇక ఎస్ఆర్‌హెచ్ జట్టుకు తిరుగుండదంటున్నారు విశ్లేషకులు. దీనికి తోడు సెంటిమెంట్ ఈసారి కలిసి రావచ్చని అంచనా వేస్తున్నారు. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకూ రెండు సార్లు టైటిల్ సాధించింది. దెక్కన్ ఛార్జర్స్ ఫ్రాంచైజీగా ఉన్నప్పుుడు 2009లో ఆస్ట్రేలియన్ కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ సారధ్యంలో టైటిల్ తొలిసారి గెలిచింది. తరువాత 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌గా పేరు మార్చుకుని మరో ఆస్ట్రేలియన్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ నేతృత్వంలో టైటిల్ గెలిచింది. ఈసారి కూడా ఆస్ట్రేలియన్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నేతృత్వంలో బరిలో ఉండటంతో ఆస్ట్రేలియన్ కెప్టెన్ల సెంటిమెంట్‌తో కప్ సాధిస్తుందనే అంచనాలున్నాయి. దీనికితోడు ఈసారి జెర్సీ కూడా మార్చుకుంది. కెప్టెన్ మారాడు, ఆటగాళ్లు మారారు, బ్యాటింగ్ తీరు మారింది, జెర్సీ మారింది. ఇక గెలవాల్సింది కప్ మాత్రమే.

Also read: IPL 2024 SRH vs MI: ఒక మ్యాచ్‌లో ఇన్ని రికార్డులా, బ్యాటర్ల విధ్వంసం అంటే ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News