IPL 2024 RCB vs CSK Match Predictions: ఐపీఎల్ 2024లో ఇవాళ బెంగళూరు వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ప్లే ఆఫ్ చేరాలంటే రెండు జట్లకు కీలకమైన మ్యాచ్ కావడంతో అందరి దృష్టీ ఈ మ్యాచ్‌పై పడింది. ఈ సందర్భంగా బెంగళూరు పిచ్ ఎలా ఉంటుంది, వాతావరణం ఎలా ఉండనుంది, రెండు జట్ల బలాబలాలేంటనేది తెలుసుకుందాం.
RCB vs CSK Head to Head Records
ఐపీఎల్లో ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే మధ్య ఇప్పటి వరకూ 33 మ్యాచ్‌లు జరగగా అందులో చెన్నై సూపర్ కింగ్స్ 22 మ్యాచ్‌లు, ఆర్సీబీ 10 మ్యాచ్‌లలో విజయం సాధించాయి. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. అంటే ఐపీఎల్ మొత్తానికి రెండు జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆధిక్యంలో ఉంది. ఇక బెంగళూరు చిన్నస్వామి స్డేడియం వేదికగా ఈ రెండు జట్ల మధ్య 10 మ్యాచ్‌లు జరిగితే అందులో ఆర్సీబీ 4, సీఎస్కే 5 మ్యాచ్‌లలో విజయం సాధించాయి. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది.
బెంగళూరు పిచ్‌పై ఆర్సీబీ ఇప్పటి వరకూ వివిధ జట్లతో 90 మ్యాచ్‌లు ఆడితే అందులో 42 విజయం సాధించగా 43 మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే మధ్య సీఎస్కే అత్యధికంగా 226 పరుగులు చేయగా ఆర్సీబీ అత్యధికంగా 218 పరుగులు చేసింది. సీఎస్కేపై ఆర్సీబీ అత్యల్ప స్కోరు 70 పరుగులు కాగా ఆర్సీబీపై సీఎస్కే అత్యల్ప స్కోరు 112 పరుగులుగా ఉంది. ఈ రెండు జట్ల తరపున ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీ అత్యధికంగా 1020 పరుగులు చేస్తే సీఎస్కే తరపున ఎంఎస్ ధోని 751 పరుగులు చేశాడు.
బెంగళూరు పిచ్ రిపోర్ట్
ఈ పిచ్ బౌలింగ్ కంటే బ్యాటింగ్ కాస్త అనుకూలంగా ఉంటుంది. మొదటి బ్యాటింగ్ చేసిన జట్ల సరాసరి అత్యధిక స్కోరు 193 పరుగులుగా ఉంది. అయితే వాతావరణం తడిగా ఉండటం, చినుకుల కారణంగా రెండ్రోజుల్నించి పిచ్ మొత్తం కవర్లతో కప్పి ఉండటంతో ఎలా ఉంటుందో చెప్పడం కష్టమేనంటున్నారు పిచ్ విశ్లేషకులు.
ఆర్సీబీ ప్లేయింగ్ 11 అంచనా
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రజత్ పాటిదార్, మహిపాల్ లోమ్రోర్, కామెరూన్ గ్రీన్, దినేషన్ కార్తీక్, యష్ దయాల్, కరణ్ శర్మ, మొహమ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్
ఇంపాక్ట్ ప్లేయర్-స్వప్నిల్ సింగ్
సీఎస్కే ప్లేయింగ్ 11 అంచనా
రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వి, ఎంఎంస్ ధోని, మిచెల్ శాంట్నర్, శార్దూల్ ఠాకూర్, మహీశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే
ఇంపాక్ట్ ప్లేయర్-సిమర్జీత్ సింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook