IPL 2024 MI vs LSG: ఈ సీజన్లో అత్యంత పేలవ ప్రదర్శనతో ఐపీఎల్‌ను ముగించిన జట్టు ఏదైనా ఉందంటే అది ముంబై ఇండియన్స్. ఆఖరి మ్యాచ్‌ను కూడా చేజార్చుకుని ఘోర పరాభవం మూటగట్టుకున్న ఒకప్పటి చాంపియన్ జట్టు ఈసారి ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. సొంత మైదానం వాంఖడేలో జరిగిన తన 14వ మ్యాచ్‌లోనూ లక్నో సూపర్ జియాంట్స్ చేతిలో ఓడిపోయి ఇంటిబాట పట్టింది. లక్నో విజయంతో లీగ్ నుంచి వైదొలిగింది.
Also Read: IPL 2024 RR vs PBKS: సామ్ కరాన్ పోరాటంతో పంజాబ్‌కు విజయం.. రాజస్థాన్ రాయల్స్ నాలుగో ఓటమి
వర్షం కారణంగా శుక్రవారం రాత్రి ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్ ఓడిన లక్నో సూపర్ జియాంట్స్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. 20 ఓవర్లలో 214 పరుగులు చేసింది. 29 బంతుల్లో 75 కొట్టి రికార్డు స్కోర్ చేశాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి అర్థ శతకం బాదాడు. దేవదత్ పడిక్కల్ ఒక్క పరుగే చేయగా.. మార్కస్ స్టోయినిస్ 28 పరుగులు చేశాడు. దీపక్ హుడా 11 పరుగులే చేయగా.. అర్షత్ ఖాన్ డకౌట్ అయ్యాడు. ముంబై బౌలర్లలో నువాన్ తుషారా, పీయూష్ చావ్లా బంతితో నిప్పులు చెరిగారు.
ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ ఓడిపోయిన మ్యాచ్‌ను విజయతీరం చేరే వరకు పోరాడారు. పూర్తి ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 196 దగ్గర ముంబై ఆగి ఓటమిని చవిచూసింది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 38 బంతుల్లో 68 పరుగులు చేయగా.. నమన్ ధీర్ కూడా (62) అర్థ శతకం బాదాడు. దేవాల్డ్ బ్రెవిస్ నువ్వు కూడా బాగా ఆడాల్సిందే. రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్ చెరో రెండు వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా ఒక వికెట్ పడగొట్టాడు. స్కై సూర్యకుమార్ యాదవ్ డకౌట్ కాగా.. నేహల్ వధెర ఒక్క పరుగే చేశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 16, ఇషాన్ కిషన్ 14 పరుగులు మాత్రమే చేశారు.
రెండూ ఇంటికే...
ఈ సీజన్లో అత్యంత పేలవ ప్రదర్శనతో ముంబై ఇండియన్స్ అట్టర్ ప్లాప్ షో చేసింది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచి 10 ఓడిపోయి అతి తక్కువగా 8 పాయింట్లు సాధించి చిట్టచివరన నిలిచింది. ఐదు సార్లు ట్రోఫీ కొట్టిన జట్టు ఈసారి ప్లేఆఫ్స్‌లోకి అడుగు కూడా పెట్టలేదు. ఇక లక్నో సూపర్ జియాంట్స్ ఆఖరి మ్యాచ్ ఆడేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలు కోల్పోయిన వేళ లక్నో అద్భుతంగా ఆడింది. సమష్టి ప్రదర్శన చేసి ఆఖరి మ్యాచ్‌ను విజయంతో ముగింపు ఇచ్చింది.
Also Read: IPL DC vs LSG: దుమ్మురేపిన పంత్ సేన.. విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పైకి.. లక్నో ఇంటికి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter