IPL 2024, Top-5 Orange Cap & Purple Cap Holders: ఐపీఎల్ 2024 సీజన్ లో జట్లన్నీ హోరాహోరీగా పోటీపడుతున్నాయి. బంతికి- బ్యాట్ కు మధ్య పోరు చాలా రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్ ద్వారా కొంత మంది యువకులు వెలుగులోకి వచ్చారు. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో సీనియర్, జూనియర్ ఆటగాళ్ల మధ్య ఉత్కంఠ పోరు నడుస్తోంది. ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సెకండ్ ఫ్లేస్ లో రియాన్ పరాగ్ కొనసాగుతున్నాడు.
ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్న టాప్-5 ఆటగాళ్లు:
విరాట్ కోహ్లీ (RCB): 316 పరుగులు (5 మ్యాచ్‌లు)
రియాన్ పరాగ్ (RR): 261 పరుగులు (5 మ్యాచ్‌లు)
శుభమన్ గిల్ (GT): 255 పరుగులు (6 మ్యాచ్‌లు)
సంజు శాంసన్ (RR): 246 పరుగులు (5 మ్యాచ్‌లు)
సాయి సుదర్శన్ (GT): 226 (6 మ్యాచ్‌లు)
బౌలర్ల విషయానికొస్తే..
రాజస్థాన్ స్పిన్నర్ యజేంద్ర చాహల్ ఐదు మ్యాచులు ఆడి 10 వికెట్లు తీసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. చాహల్ తర్వాత ముస్తాఫిజుర్ రెహమాన్ నాలుగు మ్యాచుల్లో ఆడి తొమ్మిది వికెట్లు తీసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆర్షదీప్ సింగ్ ఐదు మ్యాచులు ఆడి ఎనిమిది వికెట్లుతో మూడో ఫ్లేస్ లో నిలిచాడు. మోహిత్ శర్మ ఆరు మ్యాచుల్లో 8 వికెట్లు, కోయిట్జ్ నాలుగు మ్యాచులు ఆడి ఏడు వికెట్లు తీసి నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.
పర్పుల్ క్యాప్ రేసులో ఉన్న టాప్-5 ప్లేయర్లు:
యుజ్వేంద్ర చాహల్ (RR): 10 వికెట్లు (5 మ్యాచ్‌లు)
ముస్తాఫిజుర్ రెహ్మాన్ (CSK): 9 వికెట్లు (4 మ్యాచ్‌లు)
అర్ష్దీప్ సింగ్ (PBKS): 8 వికెట్లు (5 మ్యాచ్‌లు)
మోహిత్ శర్మ (GT): 8 వికెట్లు (6 మ్యాచ్‌లు)
ఖలీల్ అహ్మద్ (DC): 7 వికెట్లు (5 మ్యాచ్‌లు)
Also Read: PBKS vs SRH Highlights: ఉత్కంఠ మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం.. పంజాబ్ ఓటమి
అగ్రస్థానంలో రాజస్థాన్ రాయల్స్..
ఐపీఎల్ పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ తొలి స్థానంలో కొనసాగుతుంది. ఆర్ఆర్ ఐదు మ్యాచుల్లో నాలుగు గెలిచి.. ఎనిమిది పాయింట్లతో +0.871 నెట్ రన్ రేట్ తో అగ్రస్థానంలో ఉంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు మ్యాచులు గెలిచి కేకేఆర్ రెండో స్థానంలో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ కూడా మూడే మ్యాచుల్లో గెలిచి మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక చివరి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఆ జట్టు ఐదు మ్యాచుల్లో ఒకటి మాత్రమే గెలిచి అట్టడుగు స్థానంలో ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
IPL 2024 Live: అగ్రస్థానంలో కోహ్లీ, చాహల్ .. టాప్-5 ఆరెంజ్, పర్పుల్ క్యాప్ ఆటగాళ్లు వీళ్లే..!