Unbreakable records in IPL History: మరికొన్ని గంటల్లో ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా సందడి చేయనున్నారు. ఈ రిచ్ లీగ్ ఎప్పుడు మెుదలవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఆ సమయం రానే వచ్చేసింది. తొలి పోరులో చెన్నై, బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ లీగ్‌లో ఇప్పట్లో బ్రేక్ కావడానికి అవకాశం లేని రికార్డులేంటో ఓ సారి పరిశీలిద్దాం.
వరుసగా 10 విజయాలు
ఐపీఎల్ హిస్టరీలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓ అరుదైన ఘనత సాధించింది. వరుసగా పది మ్యాచుల్లో గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ ఫీట్ ను ఆ జట్టు రెండుసార్లు చేసి చూపించింది. 2014, 2015 సీజన్స్ లో కేకేఆర్ ఈ ఫీట్ సాధించింది. దీనిని ఇప్పటి వరకు ఏ టీమ్ బ్రేక్ చేయలేకపోయింది.
ఒకే సీజన్‌లో 973 పరుగులు
రన్ మిషన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అలాగే ఐపీఎల్ లో కూడా తనదైన ముద్రవేశాడు. దాదాపు ఎవరికీ సాధ్యం కాని ఓ రికార్డును నెలకొల్పాడు. 2016 సీజన్‌లో కోహ్లీ 16 మ్యాచ్‌ల్లో 81.08 సగటుతో 973 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ అత్యధిక పరుగుల రికార్డును ఏ ఆటగాడు ఇంతవరకు బద్దలుకొట్టలేదు. ఇక గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ 2023లో 890 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
అత్యధిక వ్యక్తిగత స్కోరు 175
ఐపీఎల్‌లో విండీస్ వీరుడు క్రిస్ గేల్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. 2013 సీజన్‌లో పుణె వారియర్స్‌పై కేవలం 66 బంతుల్లోనే 13 ఫోర్లు, 17 సిక్స్‌లు బాది 175 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో గేల్ కేవలం 30 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరును, సిక్స్‌ల రికార్డును ఇప్పటి వరకు ఏ క్రికెటర్ బద్దలుకొట్టలేకపోయారు.
ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఎవరిదంటే?
ఇప్పుడూ భారత క్రికెట్ లో మార్మోగిపోతున్న పేరు యశస్వి జైస్వాల్. ఈ చిచ్చర పిడుగు గత ఏడాది ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు. ఐపీఎల్ హిస్టరీలో ఇదే వేగవంతమైన అర్థ శతకం.
మూడు సార్లు హ్యాట్రిక్
క్రికెట్ లో ఒక్కసారి హ్యాట్రిక్’ సాధించడమే కష్టం. కానీ ఓ బౌలర్ ఐపీఎల్ లో ఏకంగా మూడుసార్లు ఈ ఘనత సాధించాడు. అతడే స్పిన్నర్ అమిత్ మిశ్రా. 2008లో డెక్కన్ ఛార్జర్స్‌పై, 2011లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై, 2013లో పుణె వారియర్స్‌పై హ్యాట్రిక్’ వికెట్లు తీశాడు. ఇప్పటికీ ఈ రికార్డు చెక్కుచెదరలేదు.
Also Read: Water Crisis: ఐపీఎల్ మ్యాచ్‌లను వెంటాడుతున్న నీటి కష్టాలు.. అక్కడి మ్యాచులకు శుద్ధి చేసిన నీరు..
12 పరుగులకే 6 వికెట్లు
ఐపీఎల్‌లో ఎక్కువగా బ్యాటర్లదే పైచేయి ఉంటుంది. అలాంటి ఈ రిచ్ లీగ్ లో ముంబయి ఇండియన్స్ బౌలర్ అల్జారీ జోసెఫ్ అద్భుతం చేశాడు. కేవలం 3.4 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. 2019లో సన్‌రైజర్స్‌పై ఈ ఘనత సాధించాడు. దీనిని కూడా ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.
ఈ పార్టనర్ షిప్ ను ఎవరూ బ్రేక్ చేయలేరు..
ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల పార్టనర్ షిప్ ఆర్సీబీ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. 2016లో గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరు 229 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీనిని కూడా ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.
Also Read: MS Dhoni: చెన్నై కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పుకున్న ధోనీ.. కొత్త సారథి ఎవరంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
IPL History: ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు బ్రేక్ అవ్వని రికార్డులు ఏంటో తెలుసా?