IPL 2022, SRH Playing XI vs LSG: ఐపీఎల్ 2022ను ఘోర ఓటమితో ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. నేడు మరో రసవత్తర పోరుకు సిద్దమైంది. మెగా లీగ్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది. ముంబైలోని డీవై పాటిల్ మైదానంలో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 61 పరుగుల తేడాతో ఓడిన హైదరాబాద్.. ఈ మ్యాచ్ గెలిచి బోణీ కొట్టాలని చూస్తోంది. మరోవైపు మొదటి మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓడిన లక్నో.. రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి మంచి ఊపులో ఉంది.
రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తిగా విఫలమైంది. అటు బౌలింగ్ కానీ, బ్యాటింగ్ కానీ ఏ మాత్రం బాగాలేదు. ఇటువంటి పరిస్థితిలో హైదరాబాద్ ఈ రెండు విభాగాల్లో మెరుగుపడాల్సిన అవసరం ఎంతో ఉంది. లక్నో జట్టుపై గెలవాలంటే.. అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా స్టార్ పేసర్‌పై వేటు పడే అవకాశాలు ఉన్నాయి.
మ్యాచ్ జరిగే డీవై పాటిల్ స్టేడియం పిచ్ బ్యాట్స్‌మెన్‌లకు అనుకూలం. అదే సమయంలో స్పిన్నర్లు కూడా సహకరిస్తుంది. అందుకే వాషింగ్టన్ సుందర్‌తో పాటు మరో స్పిన్నర్‌కు సారథి కేన్ విలియమ్సన్ తుది జట్టులో అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నాయి. గతకొంత కాలంగా ఐపీఎల్ మ్యాచులలో రాణిస్తున్న శ్రేయాస్ గోపాల్‌కు ఈరోజు తుది జట్టులో అవకాశం దక్కనుంది. శ్రేయాస్ జట్టులోకి వస్తే.. స్టార్ పేసర్ టీ నటరాజన్‌పై వేటు పడనుంది. ఒకవేళ కెప్టెన్ నటరాజన్‌కు ఓటేస్తే.. ఉమ్రాన్ మాలిక్ ఉండడు.
గత మ్యాచులో ఓపెనర్‌గా వచ్చిన కేన్ విలియమ్సన్.. ఈరోజు వన్‌డౌన్‌లో రానున్నాడు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠిలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అభిషేక్, త్రిపాఠి, కేన్ గత మ్యాచులో విఫలమయ్యారు. దాంతో ఈరోజు వారు రాణిస్తేనే సన్‌రైజర్స్ భారీ స్కోర్ చేయగలదు. భారీ అంచనాలు పెట్టుకున్న విండీస్ విధ్వంసకర వీరుడు నికోలస్ పూరన్ డకౌట్ అయిన విషయం తెలిసిందే. కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే పూరన్ తనదైన శైలిలో చెలరేగితే.. ఆ తర్వాత వచ్చే వారు స్వేచ్ఛగా ఆడగలరు.
రాజస్థాన్ రాయల్స్ జట్టుపై ఐడెన్ మార్కరమ్ హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. మార్కరమ్ మరోసారి చెలరేగాలని జట్టు మేనేజ్మెంట్ కోరుకుంటోంది. అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, రొమారియా షెపర్డ్ బ్యాటింగ్ భారం మోయనున్నారు. భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, షెపర్డ్ పేస్ విభాగాన్ని నడిపించనుండగా.. వాషింగ్టన్ సుందర్, శ్రేయాస్ గోపాల్ స్పిన్ మాయాజాలం చేయనున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు (అంచనా):
అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (కీపర్), ఐడెన్ మార్కరమ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, రొమారియా షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, శ్రేయాస్ గోపాల్.
Also Read: Anasuya Bharadwaj: మీరు మగజాతి పరువు తీస్తున్నారు.. నెటిజన్‌పై మండిపడ్డ అనసూయ!
Also Read: RRR Collections: 'ఆర్ఆర్ఆర్' ఖాతాలో మరో రికార్డు... 10 రోజుల్లోనే కలెక్షన్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook