GT vs RR: యజువేంద్ర చాహల్‌ను వెనుక నుంచి కాలితో లాగిపెట్టి తన్నిన ఆశిష్ నెహ్రా, ఏమైంది ఇద్దరికి

GT vs RR: ఐపీఎల్ 2022 తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ఇవాళ ప్రారంభం కానుంది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ రెండు జట్లు ఇప్పటికే కోల్‌కతా చేరుకున్నాయి. రెండు జట్ల ఆటగాళ్లు పరస్పరం సరదాగా ఉన్న కొన్ని ఫోటోలు ఈ సందర్భంగా వైరల్ అవుతున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 24, 2022, 11:09 AM IST
GT vs RR: యజువేంద్ర చాహల్‌ను వెనుక నుంచి కాలితో లాగిపెట్టి తన్నిన ఆశిష్ నెహ్రా, ఏమైంది ఇద్దరికి

GT vs RR: ఐపీఎల్ 2022 తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ఇవాళ ప్రారంభం కానుంది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ రెండు జట్లు ఇప్పటికే కోల్‌కతా చేరుకున్నాయి. రెండు జట్ల ఆటగాళ్లు పరస్పరం సరదాగా ఉన్న కొన్ని ఫోటోలు ఈ సందర్భంగా వైరల్ అవుతున్నాయి.

ఐపీఎల్ 2022 తొలి క్వాలిఫయర్ మ్యాచ్ కోసం గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్లు కోల్‌కతా చేరుకున్నాయి. ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్న ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు సిద్ఘమయ్యాయి. ఈ సందర్భంగా రెండు జట్లు ఆటగాళ్లు ఒకరితో మరొకరు సరదాగా, ఫన్నీగా ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.  తమ తమ సోషల్ మీడియా వేదికలపై ఈ ఫోటోలు షేర్ అయ్యాయి.

గుజరాత్ టైటాన్స్ షేర్ చేసిన ఓ ఫోటో బాగా వైరల్ అవుతోంది. ఈ ఫోటో అంత ఫన్నీగా ఉండటమే కారణం. గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా..రషీద్ ఖాన్ సమక్షంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడైన యజువేంద్ర చహల్‌తో సంభాషిస్తున్న ఫోటో ఇది. అది కూడా తనదైన శైలిలో. ఈ ఫోటోలో నెహ్రా..చహాల్‌ను ఆశీర్వదిస్తున్నాడు. ఇందులో విచిత్రమేముందనుకుంటున్నారా..చాహల్ ఎడమ చేతిని పట్టుకుని తన కుడికాలితో వెనుక నుంచి తన్నుతూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నాడు.ఇది నెహ్రా విషెస్ చెప్పే స్టైల్. అటు చాహల్ కూడా నవ్వుతూ ఆ కిక్ విషెస్‌ను స్వీకరిస్తున్నాడు. అందుకే ఈ ఫోటో వైరల్ అవుతోంది./p>

రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యజువేంద్ర చాహల్ ఇప్పటివరకూ 14 మ్యాచ్‌లు ఆడి 26 వికెట్లు సాధించాడు. ప్రస్తుతం పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నాడు.

Also read: Asia Cup Hockey 2022: హాకీ ఆసియా కప్‌లో తొలి మ్యాచ్‌ డ్రా.. రేపు మరో ఆసక్తికర పోరు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News