IPL 2022 Playoffs: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 15 ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. 10 జట్లు ఆడుతోన్న ఈ టోర్నీలో నాలుగు టీమ్స్ ప్లేఆఫ్స్ చేరుకోనున్నాయి. దాదాపుగా ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్ రేసులో ముందుండగా.. ప్లేఆఫ్స్ బెర్తును కన్ఫార్మ్ చేసుకునేందుకు రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తహతహలాడుతున్నాయి. అయితే లీగ్ మ్యాచ్ లు ముగిసే నాటికి టాప్ -4 స్థానాల్లో ఏఏ జట్లు ఉంటాయో అతిత్వరలోనే తెలియబోతుంది.
గుజరాత్, లక్నో మార్గం సుగమం..
ఐపీఎల్ 2022లో అరంగేట్రం చేసిన రెండు కొత్త జట్లు.. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ పెద్ద ప్రభావాన్నే చూపాయి. టోర్నీ ఆరంభం నుంచే అద్భుతమైన ప్రదర్శన కనబరచి.. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. గుజరాత్ ఆడిన 11 మ్యాచ్ ల్లో మూడింటిలో ఓడి.. 8 మ్యాచుల్లో విజయంతో 16 పాయింట్లలో అగ్రస్థానంలో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కూడా ఆడిన 10 మ్యాచ్ ల్లో మూడింటిలో ఓడి.. 14 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. శనివారం (మే 7) కోల్ కతా నైట్ రైడర్స్ తో జరగనున్న మ్యాచ్ లో లక్నో విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో తొలి స్థానానికి చేరుకునే అవకాశం ఉంది.
రాయల్స్ మధ్య పోటీ..
మరోవైపు ఐపీఎల్ పాయింట్స్ టేబుల్ లోని మూడో, నాలుగో స్థానాల్లో వరుసగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఉన్నాయి. రాజస్థాన్ ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా.. ఆర్సీబీ ఆడిన 11 మ్యాచ్ లలో 6 విజయం సాధించి తక్కువ రన్ రేట్ కారణంగా రాజస్థాన్ తర్వాత అంటే నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఐదు, ఆరో స్థానాల్లో సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఉన్నాయి.
టోర్నీ నుంచి నిష్క్రమించే జట్లు..
ఐపీఎల్ ప్లేఆఫ్స్ బరి నుంచి ఇప్పటికే మూడు టీమ్స్ తప్పుకున్నాయి. వాటిలో ముంబయి ఇండియన్స్ ముందుంది. ఎందుకంటే పాయింట్ల పట్టికలో అట్టడుగున్న ఉన్న ముంబయి ఇండియన్స్ వరుసగా 8 మ్యాచ్ లు ఓడిన క్రమంలో ప్లేఆఫ్స్ ఆశలను గల్లంతు చేసుకుంది. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో అంటే 9వ స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ దాదాపు ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఇప్పుడు నేడు జరగనున్న మ్యాచ్ ఫలితాన్ని బట్టి కోల్ కతా నైట్ రైడర్స్ కూడా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది.
Also Read: IPl 2022 MI vs GT: గుజరాత్ కు షాక్ ఇచ్చిన ముంబై, మ్యాజిక్ చేసినట్టే గెలిచిన రోహిత్ సేన
Also Read: IPL 2022: లక్నోను ఢీ కొట్టేందుకు సిద్ధమైన కోల్ కతా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.