GT vs RR: ఐపీఎల్ పైనల్ ఎప్పుడూ ఓడిపోని హార్దిక్ పాండ్యా, ఈసారి ఆ అదృష్టం కలిసొచ్చేనా?

GT vs RR: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ కీలకమైన ఐపీఎల్ 2022 తుదిపోరుకు సిద్ధమవుతున్నాయి. గుజరాత్ టైటాన్స్‌కు చెంది ఆ ఆటగాడు రాజస్థాన్ రాయల్స్‌కు ముప్పుగా మారనున్నాడు..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 29, 2022, 08:15 AM IST
  • హార్దిక్ పాండ్యాకు కలిసొస్తున్న ఐపీఎల్ పైనల్ అదృష్టం
  • ఇప్పటివరకూ తాను ఆడిన ఏ ఐపీఎల్ ఫైనల్ ఓడిపోని వైనం
  • ఈసారి ఆ అదృష్టం కలిసొస్తుందా లేదా అనే విషయంపై సర్వత్రా ఆసక్తి
 GT vs RR: ఐపీఎల్ పైనల్ ఎప్పుడూ ఓడిపోని హార్దిక్ పాండ్యా, ఈసారి ఆ అదృష్టం కలిసొచ్చేనా?

GT vs RR: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ కీలకమైన ఐపీఎల్ 2022 తుదిపోరుకు సిద్ధమవుతున్నాయి. గుజరాత్ టైటాన్స్‌కు చెంది ఆ ఆటగాడు రాజస్థాన్ రాయల్స్‌కు ముప్పుగా మారనున్నాడు..

ఐపీఎల్ 2022 చివరి పోరు ఇవాళ అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఫైనల్ పోరు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఇవాళ ఆదివారం జరగనుంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్డేడియం వేదికగా ఈ ఫైనల్ పోరు జరగనుంది. ఫైనల్ పోరులో ఎవరు విజయం సాధిస్తారనేది ఆసక్తి రేపుతోంది. అదే సమయంలో గుజరాత్ టైటాన్స్‌కు చెందిన ఆ ఆటగాడు ఇప్పటివరకూ విఫలం కాలేదు. అతనే ఇప్పుడు రాజస్థాన్ జట్టుకు ప్రమాదకరంగా మారనున్నాడు.

ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ టీమ్ ప్రదర్శన ఇప్పటి వరకూ అత్యద్భుతంగా సాగింది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఈ ఏడాది అద్భుతంగా రాణించాడు. ఫామ్ కొనసాగిస్తున్నాడు. మరో ముఖ్య విషయమేమంటే..హార్ధిక్ పాండ్యా ఇప్పటి వరకూ ఆడిన అన్ని ఐపీఎల్ ఫైనల్స్‌లో ఎప్పుడూ ఓటమి ఎదురు కాలేదు. ఇప్పుడు కెప్టెన్‌గా తొలిసారి ఫైనల్ అడబోతున్నాడు.

2015 నుంచి హార్దిక్ పాండ్యా ఐపీఎల్ ఆడుతున్నాడు. 2021 వరకూ ముంబై ఇండియన్స్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా అడిన ఫైనల్స్‌లో నాలుగుసార్లు ముంబై ఇండియన్స్ టైటిల్ గెల్చుకుంది. 2015, 2017, 2019, 2020లో ఐపీఎల్ టైటిల్‌ను ముంబై ఇండియన్స్ గెల్చుకుంది. ఇప్పుడు 5వసారి టైటిల్ గెల్చుకునేందుకు హార్దిక్ పాండ్యా దృష్టి సారించాడు.

హార్తిక్ పాండ్యా ఈ సీజన్‌లో అంటే ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఉన్నాడు. 14 మ్యాచ్‌లలో 45.30 సరాసరితో 453 పరుగులు సాధించాడు. ఐపీఎల్ 2022లో పాండ్యా 4 హాఫ్ సెంచరీలు సాదించాడు. ఈ సీజన్ హార్దిక్ పాండ్యాకు ఆటగాడిగా, కెప్టెన్‌గా కలిసొచ్చింది. అదే విధంగా తాను ఆడిన ప్రతి ఫైనల్‌ను సంబంధిత జట్టు గెలవడమనే సెంటిమెంట్ అతనికి ఈసారి ఎలా కలిసొస్తుందనేది ఆసక్తిగా మారింది. 

Also read: IPL 2022 Closing Ceremony: ఐపీఎల్ 2022లో ముగింపు వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా హాజరు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News