MS Dhoni: 'జెర్సీ నంబర్‌ 7' వెనకున్న రహస్యాన్ని బయటపెట్టిన ఎంఎస్ ధోనీ.. విషయమేంటో తెలిస్తే షాకే!!

MS Dhoni Jersey No 7. టీమిండియాకు మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ తన కెరీర్‌ మొత్తం నెంబర్‌-7 జెర్సీతోనే ఆడాడు. అయితే  జెర్సీ వెనకున్న అసలు కారణం ఏంటో చెప్పాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 18, 2022, 11:44 AM IST
  • 'జెర్సీ నంబర్‌ 7' వెనకున్న రహస్యాన్ని బయటపెట్టిన ధోనీ
  • జెర్సీ నంబర్‌ 7 ఎందుకిష్టమంటే
  • విషయమేంటో తెలిస్తే షాకే
MS Dhoni: 'జెర్సీ నంబర్‌ 7' వెనకున్న రహస్యాన్ని బయటపెట్టిన ఎంఎస్ ధోనీ.. విషయమేంటో తెలిస్తే షాకే!!

IPL 2022: CSK Captain MS Dhoni opens ups on his Iconic Jersey No 7: ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక అదృష్ట సంఖ్య (లక్కీ నంబర్) ఉంటుంది. సామాన్య ప్రజలు, ప్రముఖులు అయితే తమ వాహనాలపై లక్కీ నంబర్ వేసుకోవడం లేదా మొబైల్ నంబర్‌లో వచ్చేలా చూసుకుంటారు. ఆటగాళ్లు అయితే తమ అదృష్ట సంఖ్యను  జెర్సీలపై వేసుకుంటారు. ఫుట్‌బాల్‌ స్టార్‌ ఆటగాళ్లు లియోనల్‌ మెస్సీ (జెర్సీ నెంబర్‌ 10), క్రిస్టియానో రొనాల్డో(జెర్సీ నెంబర్‌ 7).. క్రికెట్‌ ప్లేయర్స్ సచిన్‌ టెండూల్కర్‌ (జెర్సీ నెంబర్‌ 10), విరాట్‌ కోహ్లీ ( జెర్సీ నెంబర్‌ 18), యువరాజ్‌ సింగ్‌ (జెర్సీ నెంబర్‌ 12).. ఇలా చెప్పుకుంటే పోతే ఎందరో ఉన్నారు.

టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ తన కెరీర్‌ మొత్తం నెంబర్‌-7 జెర్సీతోనే ఆడాడు. భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన సమయంలో.. ప్రస్తుత ఐపీఎల్‌లోనూ మహీ నెంబర్‌-7 జెర్సీతోనే ఆడడం మనం చూస్తున్నాం. ధోనీకి నంబర్‌ 7 ఎందుకు అంత ఇష్టం అనేది మాత్రం చాలా మందికి తెలియదు. అందరూ అది అతడి లక్కీ నంబర్‌ అని అనుకుంటారు. కానీ అలాంటిదేమీ కాదని ధోనీ స్వయంగా వెల్లడించాడు. తాను నెంబర్‌-7 జెర్సీ వేసుకోవడానికి ఓ చిన్న కారణం ఉందట. 

తాజాగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు అభిమానులతో నిర్వహించిన ఓ సమావేశంలో ఎంఎస్ ధోనీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా జెర్సీ నంబర్‌ 7పై ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిచ్చాడు. 'చాలా మంది 7 నా లక్కీ నంబర్‌ అనుకున్నారు. కానీ అలాంటిది ఏమీ లేదు. ఓ చిన్న కారణం కారణంగానే నేను 7 నంబర్‌ని ఎంచుకున్నా. నేను పుట్టిన తేది జులై 7.. అంటే ఏడో నెల ఏడో తారీఖు. అందుకే నేను 7 అంకెను ఎంపిక చేసుకున్నా. నాకు ఏ సంఖ్య కలిసివస్తుందనే విషయంలో అవీ ఇవీ ఆలోచించకుండా పుట్టిన తేదీనే అది' ని మహీ అన్నాడు. 

'ఎవరైనా నన్ను 7 అంకె ఎందుకు ఇష్టమని అడిగితే.. నేను పుట్టింది 81వ సంవత్సరం కాబట్టి 8 నుంచి 1ని తీస్తే 7 వస్తుందని సరదాగా చెప్పేవాడిని. చాలా మంది 7 సంఖ్య న్యూట్రల్‌ నంబర్‌ అని.. దానివల్ల చెడు, మంచి పెద్దగా ప్రభావం చూపవని అనేవారు. నేను కూడా అలాగే వేరే వాళ్లకి ఇదే చెప్పేవాడిని. అయితే ఈ విషయంలో నేనేమీ మూఢ నమ్మకంతో ఉండను. ఆ సంఖ్య నా మనసుకు నచ్చింది. అందుకే  దాన్నే ఫాలో అవుతున్నా' అని చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తెలిపాడు. 

ఎంఎస్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్‌ సీజన్‌ అని ఉహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ 2022 సీజన్‌ టైటిల్‌ గెలిచి మహీకి కానుకగా ఇవ్వాలని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లేయర్స్ భావిస్తున్నారు. ఐపీఎల్ 2022 కోసం అందరికంటే ముందే సూరత్‌ వేదికగా ట్రెయినింగ్‌ క్యాంప్‌ను ప్రారంభించిన సీఎస్‌కే.. తమ ప్రాక్టీస్‌ను వేగవంతం చేసింది. మార్చి 26న 15వ్ సీజన్ ఆరంభం అవుతుండగా.. అదే రోజు చెన్నై, కోల్‌కతా మధ్య మ్యాచ్ జరగనుంది. 

Also Read: RRR Runtime: ఆర్‌ఆర్‌ఆర్‌ సెన్సార్‌ పూర్తి.. షాకింగ్ రన్‌టైమ్! బాహుబలి-2 కంటే ఎక్కువ!!

Also Read: Gold ATM: పసిడి ప్రియులకు శుభవార్త.. హైదరాబాద్‌లో గోల్డ్ ఏటీఎంలు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News