IPL 2021 RR vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ జోరుకు రాజస్తాన్ రాయల్స్ బ్రేక్ వేస్తుందా, వాంఖేడే వేదికగా మ్యాచ్

IPL 2021: RR vs DC Live Streaming Online: రెండో టైటిల్ కోసం గత 13 ఏళ్లుగా రాజస్తాన్ జట్టు పోరాటం చేస్తోంది. ఈ ఏడాది తమ ఆశలు నెరవేరుతాయని ఆ ఫ్రాంచైజీ భావించింది. కానీ ఇద్దరు ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఐపీఎల్ల 2021కు దూరం కావడంతో రాజస్తాన్ జట్టుకు ఎదురుదెబ్బలు తగిలాయి.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 15, 2021, 02:48 PM IST
IPL 2021 RR vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ జోరుకు రాజస్తాన్ రాయల్స్ బ్రేక్ వేస్తుందా, వాంఖేడే వేదికగా మ్యాచ్

IPL 2021: RR vs DC Live Streaming Online:ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తొలి టైటిల్ నెగ్గిన జట్టు రాజస్తాన్ రాయల్స్. రెండో టైటిల్ కోసం గత 13 ఏళ్లుగా రాజస్తాన్ జట్టు పోరాటం చేస్తోంది. ఈ ఏడాది తమ ఆశలు నెరవేరుతాయని ఆ ఫ్రాంచైజీ భావించింది. కానీ ఇద్దరు ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఐపీఎల్ల 2021కు దూరం కావడంతో రాజస్తాన్ జట్టుకు ఎదురుదెబ్బలు తగిలాయి. తొలుత సీజన్ ప్రారంభానికి ముందే కీలక పేసర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా దూరమయ్యాడు.

తొలి మ్యాచ్‌లో గాయపడ్డ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వేలి గాయం తీవ్రతరం కావడంతో సీజన్ నుంచి తప్పుకుంటున్నాడని, అతడి సేవలు మైదానంలో అందుబాటులో ఉండవని రాజస్తాన్ రాయల్స్ తమ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత పోరాటం చేసినా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఆ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. నేడు ఢిల్లీ వాంఖేడే స్టేడియంలో ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్తాన్ తలపడనుంది. మరోవైపు తమ తొలి మ్యాచ్‌లో పటిష్ట చెన్నై సూపర్ కింగ్స్‌(Chennai Super Kings)ను ఓడించిన ఆత్మవిశ్వాసంతో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) కనిపిస్తుంది. తొలి మ్యాచ్ ఓడిన రాజస్తాన్ కీలక ఆటగాళ్లకు దూరం కావడం, చివరి వరకూ బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లు ఉన్నా అంచనాల మేరకు రాణించకపోవడం రాజస్తాన్‌కు అలవాటుగా మారింది.

Also Read: Virat Kohli: అప్పటి నుంచి తన జీవితం మారిపోయిందంటున్న RCB కెప్టెన్ విరాట్ కోహ్లీ

రిషబ్ పంత్ వర్సెస్ సంజూ శాంసన్
ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో ఫీల్డింగ్ చేస్తూ శ్రేయస్ అయ్యర్ గాయపడంతో యంట్ టాలెంటెడ్ రిషబ్ పంత్‌కు కలిసొచ్చింది. జట్టులో అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఏకంగా ఢిల్లీ క్యాపిటల్స్ సారథ్య బాధ్యతలు రిషబ్ పంత్‌కు అప్పగించారు. మరోవైపు స్టీవ్ స్మిత్‌ను ఈ ఏడాది ఐపీఎల్ 2021(IPL 2021) మినీ వేలంలో వదులుకున్న రాజస్తాన్ రాయల్స్ తమ సారథిగా సంజూ శాంసన్‌ను ప్రకటించింది. పంత్, శాంసన్ ఇద్దరూ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్లు కాగా, ఇద్దరూ హార్డ్ హిట్టర్స్. పవర్ హిట్టింగ్ నైపుణ్యం వీరికి ప్లస్ పాయింట్. 

Also Read: Ben Stokes Injury: రాజస్తాన్ రాయల్స్‌కు మరో ఎదురుదెబ్బ, ఐపీఎల్‌కు బెన్ స్టోక్స్ దూరం

కెప్టెన్ సంజూ శాంసన్‌తో పాటు జాస్ బట్లర్, శివం దుబే, రియన్ పరాగ్ బ్యాటింగ్ బారం మోయాల్సి ఉంటుంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు, మేటి బ్యాట్స్‌మెన్‌తో సమతూకంగా ఉన్నట్లు కనిపిస్తోంది. రాజస్తాన్ యువ బౌలర్ చేతన్ సకారియా బంతి(3/31)తో ఆకట్టుకున్నాడు. నేటి రాత్రి 730 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ఈ కీలక పోరుకు వేదికగా మారింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో, జియో టీవీలో, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ఐపీఎల్ 2021 మ్యాచ్‌లను వీక్షించవచ్చు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News