ఐపీఎల్-11లో రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పై విజయాన్ని నమోదు చేసింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 19 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత రాజస్థాన్ బ్యాటింగ్‌కి దిగి.. 218 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. బెంగళూరు కేవలం 6 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఆ జట్టు తరఫున బరిలోకి దిగిన వారిలో విరాట్ కోహ్లీ (57; 30 బంతుల్లో 7×4, 2×6) తప్ప ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. మన్‌దీప్ సింగ్ (47 నాటౌట్; 25 బంతుల్లో 6×4, 1×6), వాషింగ్టన్ సుందర్ (35; 19 బంతుల్లో 1×4, 3×6) మాత్రం కాస్త ఫరవాలేదనిపించారు. అయినా జట్టు గెలుపుతీరాలను చేర్చలేకపోయారు.
ఇక రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లలో సంజూ శాంసన్ (92 నాటౌట్; 45 బంతుల్లో 2×4, 10×6) మాత్రం రెచ్చిపోయి ఆడాడు. బౌలర్ల సహనాన్ని కూడా పరీక్షించాడు. కొడుతున్న ప్రతీ షాట్ కూడా బౌండరీకి పోతుండడంతో బౌలర్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఓపెనర్ అజింక్య రహానె (36; 20 బంతుల్లో 6×4, 1×6)ఔట్ అయ్యాక వచ్చిన సంజూ తన విశ్వరూపాన్ని చూపించాడు.
తన టీమ్ భారీ స్కోరు చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. సంజూ శాంసన్ భారీ స్కోరు సాధించగానే ఆయనపై అభిమానులతో పాటు తోటి క్రికెటర్లు కూడా ప్రశంసలు కురిపించారు. భారత టీమ్‌కు అలాంటి ఆటగాళ్ల అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.
RT If You Want To See Sanju Samson In Team India 🙃🙏🇮🇳 #RCBvRR #RCBvsRR
— Sir Ravindra Jadeja (@SirrrJadeja) April 15, 2018
O my goodness!!!! Some of these 6s Sanju Samson is hitting against RCB are unreal.... wow!#IPL2018
— Tabraiz Shamsi (@shamsi90) April 15, 2018
That was a special innings from Sanju Samson. Great Vishu gift. Love watching him bat. 217 even for RCB’s formidable batting line up is a daunting total #RCBvRR
— Mohammad Kaif (@MohammadKaif) April 15, 2018
Now that is what you expect from a player of the undeniable class of Sanju Samson. Not pretty 30s and 40s but biggies. What an innings this was...
— Harsha Bhogle (@bhogleharsha) April 15, 2018
Sanju Samson is an unbelievable player ... makes it look far too easy ... he is going to be a superstar .. @rajasthanroyals #IPL #India
— Michael Vaughan (@MichaelVaughan) April 15, 2018
ఛాలెంజర్స్‌పై ‘రాయల్స్’ సూపర్ విక్టరీ.. విశ్వరూపం చూపించిన సంజూ శాంసన్