ఐపీఎల్ 2018లో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై కోల్‌కతా గ్రాండ్ విక్టరీ సాధించింది. టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత కోల్‌కతాకు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా 6 వికెట్ నష్టానికి 245 పరుగులు చేయగా.. 246 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లకు ఎనిమిది వికెట్లు నష్టపోయి 214 పరుగులు చేసింది. దీంతో 31 పరుగుల తేడాతో పంజాబ్‌పై కోల్‌కతా విజయం సాధించింది. పంజాబ్ ప్లేయర్లలో ఓపెనర్ రాహుల్ (66), అశ్విన్ (45) తప్ప.. మిగతా ప్లేయర్లు రాణించలేకపోయారు. కోల్‌కతా బౌలర్లలో రస్సెల్ (3), కుల్దీప్ యాదవ్(1), సీర్లెస్(1), సునీల్ నరైన్(1), కృష్ణ(2) వికెట్లు తీశారు.
కాగా ఈ సిజన్లో అత్యధిక స్కోరు చేసిన టీమ్‌గా కోల్‌కతా రికార్డును సృష్టించింది. ఓపెనర్ సునీల్ నరైన్ (75), లిన్ (27), ఉతప్ప(24), రస్సెల్ (31), దినేష్ కార్తీక్(50) రాణించడంతో కోల్‌కతా భారీ స్కోర్ చేసింది. పంజాబ్ బౌలర్లలో.. ఆండ్రూ టైకి నాలుగు వికెట్లు దక్కగా.. మోహిత్ శర్మ, బరిందర్ సరన్ ఒక్కో వికెట్ తీశారు.