IPL 2020: ఐపీఎల్ ప్రారంభం ఎప్పుడో తెలుసా?

కరోనా వైరస్ కారణంగా వాయిదాపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020 Starting Date)ను సెప్టెంబర్ నెలలో నిర్వహించానలి పాలక మండలి భావిస్తోంది. సభ్యుల సమావేశం తర్వాత ప్రస్తుతం చర్చించిన తేదీలను ఖరారు చేయనున్నారు.

Last Updated : Jul 24, 2020, 08:05 AM IST
IPL 2020: ఐపీఎల్ ప్రారంభం ఎప్పుడో తెలుసా?

కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) నాలుగు నెలలు వాయిదా పడింది. దీనికి స్వస్తి పలుకుతూ ఐపీఎల్ నిర్వహణపై త్వరలో ప్రకటన రానుంది. ఈ ఏడాది లీగ్‌ను యూఏఈలో నిర్వహించనున్నారని తెలిసిందే. టీ20 ప్రపంచ కప్‌ను ఐసీసీ వాయిదా వేయడం ఐపీఎల్ నిర్వహణకు కలిసొచ్చింది. Sourav Ganguly: త్వరలో తేలనున్న గంగూలీ భవితవ్యం.. IPL టైమ్‌లో చిక్కులు

టీ20 వరల్డ్ కప్ వాయిదా పడగానే బీసీసీఐ చక్రం తిప్పుతోంది. ఐపీఎల్ నిర్వహణ దిశగా చకచకా అడుగులు వేస్తోంది. అన్నీ కుదిరితే సెప్టెంబర్ 19 (IPL 2020 in September 19)న ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కానుందని బీసీసీఐ అధికారిక వర్గాలు చెబుతున్నాయి. నవంబర్ 8 వరకు ఈ ట్వంటీ20 లీగ్ నిర్వహించాలని యోచిస్తున్నారు. ఐపీఎల్ పాలక మండలి సభ్యులు భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ విషయాన్ని ఏఎన్ఐ మీడియా రిపోర్ట్ చేసింది. IPL 2020: యూఏఈలోనే ఐపీఎల్ 2020.. 3 వేదికలు

కాగా, కరోనా వైరస్ రాకపోతే ఈ ఏడాది మార్చి 29న ఐపీఎల్ 2020 ప్రారంభం అయ్యేది. టీ20 వరల్డ్ కప్‌ నిర్వహణపై ఐసీసీ స్పష్టతనివ్వడంతో ఎలాగైనా సరే ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. ఎంతో సురక్షిత ప్రాంతంగా కనిపిస్తున్న యూఏఈలో ఐపీఎల్ నిర్వహించాలని భావిస్తున్నట్లు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ మంగళవారం తెలిపారు.  జబర్దస్త్ యాంకర్ Anasuya లేటెస్ట్ ఫొటోలు   
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్

 

Trending News