Rishabh Pant: రోడ్డుప్రమాదంలో రిషబ్‌ పంత్‌కు తీవ్రగాయాలు.. కాలి బూడిదైన కారు

Rishabh Pant Accident: రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు రోడ్డుప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పంత్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2022, 09:43 AM IST
Rishabh Pant: రోడ్డుప్రమాదంలో రిషబ్‌ పంత్‌కు తీవ్రగాయాలు.. కాలి బూడిదైన కారు

Rishabh Pant Accident: టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తుండగా.. పంత్ ప్రయాణిస్తున్న కారు రైలింగ్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. పంత్‌కు కాలు, నుదిటి, వీపుపై ఎక్కువ గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో ఢిల్లీకి తరలించారు. రిషబ్‌కి ప్లాస్టిక్ సర్జరీ చేసే అవకాశం కనిపిస్తోంది.

రిషబ్ ప్రయాణిస్తున్న కారు రైలింగ్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత కారులో మంటలు చెలరేగాయి. అంతకుముందే పంత్ కారు నుంచి దూకేసినట్లు తెలిసింది. చాలా కష్టపడి మంటలను అదుపు చేశామని అక్కడున్న ప్రజలు తెలిపారు. అనంతరం పంత్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆయనను ఢిల్లీ రోడ్డులోని సక్షమ్ ఆసుపత్రిలో చేర్చారు.  

రూర్కీలోని నర్సన్ సరిహద్దులోని హమ్మద్‌పూర్ ఝల్ సమీపంలో పంత్ కారు రైలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం తర్వాత కారులో మంటలు చెలరేగాయి. దీంతో అది పూర్తిగా కాలి బూడిదైంది. పంత్ వీపు, భుజానికి కూడా గాయాలయ్యాయని.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

రిషబ్ పంత్ తన మెర్సిడెస్ కారులో ఢిల్లీ నుంచి రూర్కీకి వెళ్తున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల వారు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పంత్‌ను ఢిల్లీ రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే మంటలు ఆర్పే సమయానికి కారు పూర్తిగా దగ్ధమైంది.  కారులో నుంచి పంత్ ముందే దూకేయడంతో పెను ప్రమాదం తప్పింది.

Also Read: Pele Death: లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ పీలే కన్నుమూత.. శోకసంద్రంలో క్రీడా ప్రపంచం

Also Read: Highest Earing Players in IPL: ఐపీఎల్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాళ్లు వీళ్లే.. రోహిత్ శర్మ తరువాత ఎవరంటే..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News