Indian Archer Deepika Kumari: భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి అరుదైన ఘనత సాధించింది. ప్రపంచ ఆర్చర్లలో నెంబర్ వన్‌గా నిలిచింది. తాజాగా ప్రకటించిన ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో ఆర్చర్ దీపికా కుమారి నెంబర్ వన్ ర్యాంకు సాధించి భారత కీర్తిపతాకాన్ని రెపరెపలాడించింది. ఆర్చరీ వరల్డ్ కప్‌లో భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి స్వర్ణ పతకాల పంట పండించింది.
పారిస్ వేదికగా జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్‌లో మహిళల వ్యక్తిగత విభాగంతో పాటు మహిళల రికర్వ్, మిక్స్‌డ్ విభాగాలలో భారత్‌కు బంగారు పతకాలు అందించింది. ప్రపంచకప్ స్టేజ్ 3 టోర్నీలో భారత ఆర్చర్ దీపికా కుమారి మూడు స్వర్ణ పతకాలు సాధించడంతో మెరుగైన రేటింగ్ పాయింట్లు తన ఖతాలో వేసుకుంది. ఈ క్రమంలో సోమవారం నాడు ప్రకటించిన ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకుంది. టోక్యో ఒలింపిక్స్‌కు దీపికా కుమారి ప్రదర్శన దేశ వ్యాప్తంగా నూతనోత్సాహాన్ని నింపుతోంది.
Also Read: WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్లో Team India ఓటమికి Sachin Tendulkar కారణాలు ఇవే
Three gold medals. 🥇🥇🥇
Three winning shots.Deepika Kumari is in the form of her life. 🇮🇳🔥#ArcheryWorldCup pic.twitter.com/bMdvvGRS6i
— World Archery (@worldarchery) June 27, 2021
కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న దీపికా కుమారి తన ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేసింది. ‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. అదే సమయంలో ఈ ఫామ్‌ను కొనసాగించాల్సి వస్తుంది. ఇంకా మెరుగైన ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తాను. టోక్యో ఒలంపిక్స్ కోసం సన్నద్ధమవుతున్నాను. మరిన్ని బంగారు పతకాలు సాధించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని’ భారత ఆర్చర్ దీపికా కుమారి స్పందించింది. మరోవైపు ఈ టోర్నీలో కొరియా ఆర్చర్లు పాల్గొనకపోవడం భారత ఆర్చర్లకు కలిసొచ్చింది. లేకపోతే వారి నుంచి గట్టి పోటీ ఎదరుయ్యేదని విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: IPL Season 14: ఐపీఎల్ సీజన్ 14 లో విదేశీ ఆటగాళ్లకు గ్రీన్ సిగ్నల్, ఫ్రాంచైజీలకు గుడ్‌న్యూస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook