ఇండియా Vs సౌతాఫ్రికా రెండో వన్డే: భారత్ లక్ష్యం 119 పరుగులు

119  పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 26 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది.

Last Updated : Feb 4, 2018, 04:44 PM IST
ఇండియా Vs సౌతాఫ్రికా రెండో వన్డే: భారత్ లక్ష్యం 119 పరుగులు

సెంచూరియన్ వేదికగా సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ తొలి వన్డేలో గెలిచిన ఆత్మవిశ్వాసంతో రెండో వన్డేలో ఎటువంటి మార్పులేవీ చేయకుండా బరిలోకి దిగింది. అయితే సౌతాఫ్రికా జట్టులో గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. చేతిగాయం కారణంగా తొలి మూడు వన్డే మ్యాచ్ లకు డివిలియన్స్ దూరంకాగా, చేతివేలి గాయం కారణంగా దూప్లేసిస్ సిరీస్ నుండి తప్పుకున్నాడు. కెప్టెన్ గా మార్కరమ్ బాధ్యతలు తీసుకున్నాడు.

బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా 32.2 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సౌతాఫ్రికా ఆటగాళ్లు హసీమ్ అమ్లా 23, డికాక్ 20, డుమిని 25, జొన్డో 25, మార్కరమ్ 8 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్ మెన్లలో ముగ్గురు డకౌట్లు కాగా, మరో ఇద్దరు చెరో ఒక పరుగులు చేశారు. ఈ వన్డేలో భారత బౌలర్లు చాహల్ 5వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ 3వికెట్లు, భువనేశ్వర్ 1వికెట్, బుమ్రా1వికెట్ తీశారు.

119  పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 26 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. రోహిత్ శర్మ 15 పరుగులు చేసి రబడ బౌలింగ్ లో మోర్కెల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కడపటి వార్తలందేసరికి భారత్ 9 ఓవర్లకు 55 పరుగులు చేసింది.   

Trending News