India vs New Zealand Updates: టీమిండియాకు గాయాల భయం.. ఇషాన్‌ కిషన్‌పై తేనెటీగ దాడి.. సూర్యకు మణికట్టు గాయం

India vs New Zealand World Cup 2023: న్యూజిలాండ్‌తో పోరుకు ముందు భారత ఆటగాళ్ల గాయాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే హర్థిక్ పాండ్యా ఔట్ అవ్వగా.. తాజాగా ఇషాన్ కిషన్‌పై తేనెటీగ దాడి చేసింది. సూర్యకుమార్ యాదవ్ మణికట్టు గాయంతో ఇబ్బంది పడ్డాడు.  

Written by - Ashok Krindinti | Last Updated : Oct 21, 2023, 08:48 PM IST
India vs New Zealand Updates: టీమిండియాకు గాయాల భయం.. ఇషాన్‌ కిషన్‌పై తేనెటీగ దాడి.. సూర్యకు మణికట్టు గాయం

India vs New Zealand World Cup 2023: వరల్డ్ కప్‌లో మరో బిగ్‌ఫైట్‌కు టీమిండియా రెడీ అవుతోంది. ఆదివారం టేబుల్ టాపర్‌గా ఉన్న న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. అయితే ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియాను గాయాల భయం వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ ఆల్‌రౌండర్ హర్ధిక్ పాండ్యా గాయం కారణంగా దూరమైన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీని కాలితో ఆపేందుకు ప్రయత్నించి.. గాయపడ్డాడు. దీంతో అర్ధాంతరంగా గ్రౌండ్‌ను వీడాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు కూడా దూరమైనట్లు బీసీసీఐ వెల్లడించింది. హార్థిక్ పాండ్యా ప్లేస్‌లో జట్టులోకి ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ధర్మశాలలో రేపు మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్‌ జరగనుంది. 

ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ సెషన్‌లో ఫుల్‌ బిజీగా ఉన్న ఇషాన్ కిషన్‌ను తేనెటీగ కుట్టింది. శనివారం సాయంత్రం నెట్ ప్రాక్టీస్‌ సందర్భంగా మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌ ఎదుర్కొంటుండగా.. ఓ తేనేటీగ సడెన్‌గా వచ్చి కుట్టింది. దీంతో ఇషాన్ వెంటనే బ్యాట్‌ను విసిరేశాడు. దీంతో వెంటనే నెట్స్‌ నుంచి బయటకు వెళ్లాడు. కాసేపటికే ఫిజియో వచ్చి చెక్ చేశాడు. ఇక మెడను అలాగే పట్టుకుని కూర్చొని.. ప్రాక్టీస్‌ను ఆపేశాడు. మరో స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా గాయంతో ఇబ్బంది పడ్డాడు. 

ప్రాక్టీస్ సెషన్‌లో సూర్యకుమార్ యాదవ్ కుడి మణికట్టుకు బంతి తగలడంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో నెట్‌ నుంచి బయటకు వచ్చి కూర్చొన్నాడు. ఫిజియో ఐస్‌బ్యాగ్‌ను అందించగా.. చేయిపై పెట్టుకుని రెస్ట్ తీసుకున్నాడు. కాసేపటికి నొప్పి నుంచి ఉపశమనం పొందినట్లు కనిపించాడు. రేపటి మ్యాచ్‌కు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లలో ఒకరిని జట్టులో వచ్చే అవకాశం ఉంది. మరోవైపు నెట్స్‌లో శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్ చివరగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. శార్దూల్ ఎడమచేతి స్పిన్నర్‌తో పాటు లెఫ్ట్, రైట్ త్రోడౌన్ స్పెషలిస్ట్‌లతో ప్రాక్టీస్ చేశాడు. అశ్విన్ స్లోడ్రైవ్‌లపై దృష్టిపెట్టాడు. 

ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో న్యూజిలాండ్‌తో భారత జట్టు మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించింది. అదే సమయంలో న్యూజిలాండ్ కూడా నాలుగు మ్యాచ్‌లు గెలిచింది. అయితే మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా న్యూజిలాండ్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. భారత్ రెండోస్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌కు మరింత చేరువ అవుతుంది. 

Also Read: Drop 4K Tv Price: బిగ్ దసరా సేల్‌లో సాంసంగ్‌ 4K Tv స్మార్ట్‌ టీవీని రూ.22,940కే పొందండి!

Also Read:  Lava Blaze Pro 5G Price: బంఫర్‌ ఆఫర్‌ మీ కోసం..Lava Blaze 5G మొబైల్‌పై రూ.9,400 వరకు తగ్గింపు! 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News