India vs New Zealand: వరల్డ్‌కప్‌లో నేడు కీలక పోరు.. న్యూజిలాండ్‌తో టీమిండియా ఢీ

Ind Vs NZ Hockey World Cup: హాకీ వరల్డ్ కప్‌లో ఆదివారం కీలక పోరుకు టీమిండియా రెడీ అవుతోంది. పూల్ డీ రెండోస్థానంలో ఉన్న భారత్.. క్వార్టర్ ఫైనల్ చేరాలంటే నేడు న్యూజిలాండ్‌తో జరగబోయే మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. ఈ మ్యాచ్‌కు భారత్‌ను కీలక ఆటగాళ్లు గాయాలు కలవర పెడుతున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2023, 11:39 AM IST
India vs New Zealand: వరల్డ్‌కప్‌లో నేడు కీలక పోరు.. న్యూజిలాండ్‌తో టీమిండియా ఢీ

Ind Vs NZ Hockey World Cup: ఒడిశాలో జరుగుతున్న 15వ హాకీ ప్రపంచకప్‌లో పూల్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. నాలుగు పూల్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లు నేరుగా క్వార్టర్స్‌లో చోటు దక్కించుకున్నాయి. ఇప్పుడు క్వార్టర్ ఫైనల్స్‌లోని మిగిలిన నాలుగు బెర్త్‌ల కోసం ఎనిమిది జట్ల మధ్య క్రాస్ ఓవర్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ క్రాస్ ఓవర్ మ్యాచ్‌లు నేటి నుంచే ప్రారంభం కానున్నాయి.

ఈ ప్రపంచకప్‌లో నాలుగు పూల్స్‌లో 16 జట్లు ఉన్నాయి. ప్రతి పూల్‌లో గెలిచిన జట్టు నేరుగా క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. ఆస్ట్రేలియా, బెల్జియం, నెదర్లాండ్స్, ఇంగ్లాండ్ జట్లు తమ తమ పూల్స్‌లో మొదటి స్థానంలో నిలిచాయి. దీంతో ఈ నాలుగు జట్లు క్వార్టర్స్‌కు చేరాయి. ఏ జట్టుతో ఏ టీమ్‌తో క్రాస్ ఓవర్ మ్యాచ్ ఆడుతుందో తెలుసుకోండి. 

మొదటి క్రాస్ ఓవర్ మ్యాచ్: మలేషియా vs స్పెయిన్ (ఆదివారం సాయంత్రం 4.30, కళింగ స్టేడియం, భువనేశ్వర్)
రెండో క్రాస్ ఓవర్ మ్యాచ్: భారత్ vs న్యూజిలాండ్ (ఆదివారం, రాత్రి 7 గంటలు, కళింగ స్టేడియం, భువనేశ్వర్)
మూడో క్రాస్ ఓవర్ మ్యాచ్: జర్మనీ vs ఫ్రాన్స్ (సోమవారం సాయంత్రం 4.30, కళింగ స్టేడియం, భువనేశ్వర్)
నాల్గో క్రాస్ ఓవర్ మ్యాచ్: అర్జెంటీనా vs దక్షిణ కొరియా (సోమవారం కళింగ స్టేడియం, భువనేశ్వర్)

పూల్ డీలో ఉన్న టీమిండియా ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. దీంతో న్యూజిలాండ్‌తో నేడు క్రాస్ ఓవర్ మ్యాచ్‌ ఆడనుంది. తొలి మ్యాచ్‌లో 2-0 తేడాతో స్పెయిన్‌పై విజయంతో టోర్నమెంట్‌ను ప్రారంభించింది. ఆ పటిష్టమైన ఇంగ్లాండ్‌తో 0-0తో డ్రా చేసుకుంది. పూల్ డీ‌లో అగ్రస్థానంలో నిలిచేందుకు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించడానికి వేల్స్‌ను 8 గోల్స్ తేడాతో ఓడించాల్సి ఉండగా.. భారత జట్టు 4-2 తేడాతో గెలుపొందింది. దీంతో రెండోస్థానానికే పరిమితమై పోయింది. 

ఆదివారం చివరి మ్యాచ్‌లో భారత్‌ న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే క్వార్టర్ ఫైనల్‌లో చోటు దక్కుతుంది. లేదంటే వరల్డ్ కప్‌ నుంచి నిష్క్రమించాల్సిందే. కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియాను గాయాలు కలవరపెడుతున్నాయి. గాయం కారణంగా హార్దిక్ సింగ్ టోర్నీ నుంచి వైదొలగాడు.  మరో ఆటగాడు మన్‌దీప్ సింగ్ కూడా ఆడటం అనుమానంగా మారింది. మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఫిట్‌నెస్ పరీక్షలో పాస్ అయితే.. తుది జట్టులో ఉంటాడు. హర్మన్‌ప్రీత్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్ వంటి సీనియర్ ఆటగాళ్ల బాధ్యత మరింత పెరిగింది. 

అన్ని క్రాస్‌ఓవర్ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 2 SD, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 2 హెచ్‌డీలో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. అదేవిధంగా Disney + Hotstar యాప్‌లో లైవ్ అందుబాటులో ఉంటుంది.

తుది జట్లు ఇలా (అంచనా):

భారత్: జీఆర్ శ్రీజేష్ (గోల్ కీపర్), సురేందర్ కుమార్, వివేక్ ప్రసాద్, మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), మన్‌దీప్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, షంషేర్ సింగ్, వరుణ్ కుమార్, ఆకాష్‌దీప్ సింగ్, అమిత్ రోహిదాస్, సుఖ్‌జీత్ సింగ్

న్యూజిలాండ్: డొమినిక్ డిక్సన్ (గోల్ కీపర్), సైమన్ చైల్డ్, కిమ్ కింగ్‌స్టోన్, సామ్ లేన్, సైమన్ యార్స్టోన్, ఐడాన్ సరికాయ, నిక్ వుడ్స్ (కెప్టెన్), కేన్ రస్సెల్, బ్లెయిర్ టారెంట్, సీన్ ఫైండ్లే, హేడెన్ ఫిలిప్స్

Also Read: Rohit Sharma: గ్రౌండ్‌లోకి దూసుకువచ్చిన బాలుడు.. రోహిత్ శర్మ చెప్పిన ఆ ఒక్క మాటతో..

 

Also Read: Wipro Lays Off: విప్రో ఉద్యోగులకు ఝలక్.. 400 మందికి ఉద్వాసన  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News