KL Rahul test century: ఇండియా vs ఇంగ్లండ్‌ రెండో టెస్ట్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సెంచరీ

India vs England 2nd Test Day 1 Score live updates: ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ మైదానం వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ చెలరేగిపోయాడు. తొలి టెస్టులో సెంచరీ చేజార్చుకున్న కేఎల్ రాహుల్ ఈసారి సెకండ్ టెస్ట్ మ్యాచులో సెంచరీ పూర్తి చేసుకుని తన సత్తా చాటుకున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 13, 2021, 12:27 AM IST
KL Rahul test century: ఇండియా vs ఇంగ్లండ్‌ రెండో టెస్ట్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సెంచరీ

India vs England 2nd Test Day 1 Score live updates: ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ మైదానం వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ చెలరేగిపోయాడు. తొలి టెస్టులో సెంచరీ చేజార్చుకున్న కేఎల్ రాహుల్ ఈసారి సెకండ్ టెస్ట్ మ్యాచులో సెంచరీ పూర్తి చేసుకుని తన సత్తా చాటుకున్నాడు. రాహుల్‌కి ఇది టెస్టు మ్యాచుల్లో ఆరో సెంచరీ. 212 బంతుల్లో రాహుల్ సెంచరీ పూర్తి చేశాడు. ఇంగ్లండ్ గడ్డపై రాహుల్‌కి ఇది రెండో సెంచరీ. 2018లో ఓవల్ గ్రౌండ్‌లో రాహుల్ తొలిసారి ఇంగ్లండ్ గడ్డపై సెంచరీ చేశాడు.

తొలుత నెమ్మదిగా ఆట ఆరంభించిన రాహుల్.. రోహిత్ శర్మ (Rohit Sharma- 83) వ్యక్తిగత పరుగుల వద్ద ఔట్ అయిన అనంతరం పరుగుల రాబట్టడంలో వేగం పెంచాడు. 77 ఓవర్లో మార్క్ వుడ్ వేసిన బంతిని ఫోర్ కొట్టడంతో కెఎల్ రాహుల్ మరో సెంచరీని (KL Rahul test century) తన ఖాతాలో వేసుకున్నాడు. 

Also read : Ind vs Eng 2nd test match live updates: ఇండియా vs ఇంగ్లాండ్ 2వ టెస్ట్ డే 1 అప్‌డేట్స్: టాస్ గెలిచిన జో రూట్

ఇంగ్లండ్‌పై తొలి టెస్ట్ కంటే ముందుగా మయంక్ అగర్వాల్ గాయపడటంతో అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన కెఎల్ రాహుల్ (KL Rahul).. రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా దిగి తానేంటో నిరూపించుకుంటున్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (Virat Kohli), కెఎల్ రాహుల్ క్రీజులో ఉన్నారు. విరాట్ కోహ్లీ 94 బంతుల్లో 40 పరుగులు పూర్తిచేసుకున్నాడు.

Also read : Ind vs Eng 2nd test match live updates: నేటి నుంచే భారత్‌-ఇంగ్లాండ్‌ రెండో టెస్ట్..లార్డ్స్‌లో ఎవరిది పైచేయి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News