India vs Bangladesh1st Test Playing XI Out: మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో బంగ్లాదేశ్‌కు అప్పగించిన టీమిండియా.. మరో సమరానికి సిద్దమైంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా చటోగ్రామ్ వేదికగా మరికొద్దిసేపట్లో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి టెస్టులో చోటు ఆశించిన భారత యువ ఆటగాళ్లు సౌరబ్ కుమార్, అభిమన్యు ఈశ్వరన్‌కు నిరాశే ఎదురైంది.
లోకేష్ రాహుల్‌తో కలిసి శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ ఆరంబించనున్నాడు. దాంతో ఇండియా ఏ ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్‌కు నిరాశే ఎదురైంది. యువ స్పిన్నర్ సౌరబ్ కుమార్, పేసర్ జయదేవ్ ఉనద్కత్‌కు జట్టులో చోటు దక్కలేదు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. భారత్ ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లు, ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ బెంచ్‌కె పరిమితం అయ్యాడు.
వన్డే సిరీస్ గెలిచిన ఉత్సాహంలో బంగ్లాదేశ్ ఉండగా.. టెస్ట్ సిరీస్ గెలిచి పరువు కాపాడుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడితే.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌పై ప్రభావం చూపుతుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ దక్కించుకోవాలంటే భారత్ ఈ సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకోవాల్సి ఉంది. గాయాల కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో సహా పలువురు స్టార్ ప్లేయర్స్ ఈ టెస్ట్ సిరీస్‌కు దూరమయిన విషయం తెలిసిందే.
A look at #TeamIndia's Playing XI for the first #BANvIND Test 🔽
Follow the match ▶️ https://t.co/CVZ44NpS5m pic.twitter.com/KgshrnZh8i
— BCCI (@BCCI) December 14, 2022
తుది జట్లు:
భారత్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్, మహమ్మద్ సిరాజ్.
బంగ్లాదేశ్: జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, లిట్టన్ దాస్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, యాసిర్ అలీ, నూరుల్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్, ఎబాడోత్ హొస్సేన్.
Also Read: BRS Central Office: నేడు ఢిల్లీలో బీఆర్‌ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభం.. మంత్రి కేటీఆర్ డుమ్మా!
Also Read: Congo Floods: కాంగోలో భారీ వరదలు.. 120 మంది దుర్మరణం! స్తంభించిపోయిన జన జీవితం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.