India Vs Australia: ఆసీస్‌పై భారత్ ఘన విజయం

మొదటి టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై ఘోర ఓటమి పాలైన టీమిండియా మెల్‌బోర్న్‌లో అద్భుతంగా రాణించి ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఆసీస్‌ను ముప్పుతిప్పలు పెట్టి ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. 

Last Updated : Dec 29, 2020, 09:58 AM IST
India Vs Australia: ఆసీస్‌పై భారత్ ఘన విజయం

India Vs Australia: India win 2nd Test match | మెల్‌బోర్న్‌: మొదటి టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై ఘోర ఓటమి పాలైన టీమిండియా మెల్‌బోర్న్‌లో అద్భుతంగా రాణించి ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు (India Vs Australia) ఆసీస్‌ను ముప్పుతిప్పలు పెట్టి ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. రెండు ఇన్నింగ్స్‌లల్లో కూడా 200 లోపు పరుగులకే కట్టిడి చేసి బౌలింగ్‌తో ఆస్ట్రేలియా ఆటగాళ్లకు చుక్కలు చూపించారు (Team India) భారత ఆటగాళ్లు. 

బాక్సింగ్ డే రెండో టెస్ట్ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా..(Australia) తొలి ఇన్నింగ్స్‌లో 195 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భార‌త్ (India) కొద్దిగా ఇబ్బంది ప‌డ్డ‌ప్ప‌టికీ, శుభ్‌మ‌న్ గిల్‌, ర‌హానే, జ‌డేజాల అద్భుతంగా రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 326 ప‌రుగులు చేశారు.  ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా స‌రిగ్గా 200 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. 

ఆస్ట్రేలియా జట్టులో గ్రీన్ 45, వేడ్ 40, లబుషేన్ 28, కమిన్స్ 22 కాసేపు ప్రతిఘ‌టించ‌డంతో భార‌త్ విజయం కాస్త ఆలస్యం అయింది. రెండో ఇన్నింగ్స్‌లో  సిరాజ్ 3, బుమ్రా, జడేజా, అశ్విన్‌కు తలో 2 వికెట్లు, ఉమేష్ ఒక వికెట్‌ తమ ఖాతాల్లో వేసుకున్నారు. Also Read: MS Dhoniకి అత్యంత అరుదైన పురస్కారం

70 ప‌రుగుల ల‌క్ష్యంతో లంచ్‌ విరామం అనంతరం బ్యాటింగ్ చేప‌ట్టిన టీ మిండియా మొదట్లోనే రెండు వికెట్లు వెంట వెంట‌నే కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ అగ‌ర్వాల్ (5), పుజారా(3) ప‌రుగుల‌ే చేసి ఔటయ్యారు. తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న శుభ్‌మ‌న్ గిల్(35) , స్టాండింగ్ కెప్టెన్ ర‌హానే(24)తో క‌లిసి భార‌త్‌ను విజ‌య‌తీరాల‌కు చేర్చారు. దీంతో సిరీస్ 1-1తో స‌మం అయింది. ఈ సిరీస్‌లో మరో టెస్ట్‌ మిగిలి ఉంది.  

Also Read: Pakistan vs New Zealand: స్టేడియంలోకి నగ్నంగా దూసుకొచ్చిన అభిమాని.. Viral Video

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News