India vs Australia 4th Test: Jasprit Bumrah Ruled Out Of Brisbane Test: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఆటగాళ్ల గాయాల పరంపర కొనసాగుతోంది. మూడో టెస్టు అనంతరం రవీంద్ర జడేజా, హనుమ విహారి గాయాల కారణంగా సిరీస్ నుంచి వైదొలిగారు. నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండరని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ జాబితాలో తాజాగా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా చేరాడు. నాలుగో టెస్టుకు బుమ్రా సైతం అందుబాటులో ఉండటం లేదని ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.
రిపోర్టుల ప్రకారం చూస్తే బ్రిస్బేన్ వేదికగా జరగనున్న నాలుగో టెస్టుకు బుమ్రా అందుబాటులో ఉండటం సాధ్యం కాదు. అయితే బుమ్రా గైర్హాజరీపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ఎలాంటి ప్రకటన చేయలేదు. భారత(Team India) బౌలింగ్ దళాన్ని నడిపించే బౌలర్ లేకపోవడం గమనార్హం. గాయాల కారణంగా ఇదివరకే మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ లాంటి బౌలర్లు సిరీస్ మధ్యలోనే వైదొలిగారు. తాజాగా బుమ్రా ఈ జాబితాలో చేరనున్నాడు.
Also Read: India vs Australia 3rd Test Highlights: ఇండియా Vs ఆస్ట్రేలియా 3వ టెస్ట్ రికార్డులు
కీలకమైన నాలుగో టెస్టులో కేవలం రెండు టెస్టు మ్యాచ్‌ల అనుభవం ఉన్న తెలుగు తేజం, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ టీమిండియా బౌలింగ్ దళాన్ని నడిపించనున్నాడు. మరోవైపు పంత్, అశ్విన్ సైతం గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. బుమ్రా(Jasprit Bumrah) స్థానంలో నటరాజన్‌కు అవకాశం రావొచ్చు.
Also Read: Virat Kohli Blessed With A Baby Girl: తండ్రయిన విరాట్ కోహ్లీ.. పాపకు జన్మనిచ్చిన అనుష్క శర్మ
జడేజా స్థానంలో జట్టులోకి వస్తే.. శార్దూల్ ఠాకూర్‌కు సైతం అనుభవం లేదు. దీంతో చివరి మ్యాచ్‌లో భారత్ నెగ్గడం అంత తేలిక కాదని తెలుస్తుంది. కనీసం టెస్టు మ్యాచ్ డ్రా చేసుకున్నా భారత్ తమ సత్తా చాటినట్లేనని క్రికెట్ ప్రేమికులు భావిస్తున్నారు.
Also Read: India VS Australia 3rd Test: అశ్విన్, విహారి హీరోచిత పోరాటం.. నైతిక విజయం టీమిండియాదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook