ఆస్ట్రేలియాతో తొలి టీ20కి సిద్ధమవుతున్న భారత జట్టు ఇదే..!

ఆస్ట్రేలియాతో తొలి టీ20కి సిద్ధమవుతున్న భారత జట్టు బుధవారం గబ్బా స్టేడియంలో పోరుకి సన్నద్ధమవుతోంది.

Last Updated : Nov 20, 2018, 02:04 PM IST
ఆస్ట్రేలియాతో తొలి టీ20కి సిద్ధమవుతున్న భారత జట్టు ఇదే..!

ఆస్ట్రేలియాతో తొలి టీ20కి సిద్ధమవుతున్న భారత జట్టు బుధవారం గబ్బా స్టేడియంలో పోరుకి సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆరంభ టీ20కి వెళ్తున్న భారత జట్టు వివరాలను బీసీసీఐ ఈ రోజు ప్రకటించడం విశేషం. తొలి టీ20 కోసం 12 మందిని ఎంపిక చేసిన బీసీసీఐ వాటి వివరాలను మీడియాకి తెలిపింది. వికెట్ కీపరుగా రిషబ్ పంత్ వ్యవహరిస్తారని తెలిపిన బీసీసీఐ.. మరో వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌ను మిడిల్ ఆర్డరు బ్యాట్స్‌మన్‌గా తీసుకోవడం గమనార్హం. ఈ టీ20 మ్యాచ్‌లో ధోనికి విశ్రాంతి ఇవ్వడంతో.. ఆయన స్థానంలో రిషబ్ పంత్ కీపింగ్ చేస్తాడని సమాచారం.

ఇక విండీస్ జట్టుతో టీ20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ కోహ్లీ.. మనీష్ పాండే స్థానంలో మళ్లీ జట్టులోకి రావడం జరిగింది. ఈ మార్పు తప్పితే విండీస్‌పై గెలిచిన భారత జట్టునే ఈ టీ20కి కూడా తీసుకోవడం జరిగింది. ధావన్, రోహిత్ శర్మ ఈ సారి ఓపెనింగ్ చేయడానికి దిగగా.. కోహ్లీ మూడవ స్థానంలో.. కేఎల్ రాహుల్ నాల్గవ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వస్తారు. 

ఈ టీ20కి భారత జట్టు టీమ్ వివరాలు ఇవే: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్  బుమ్రా, ఖలీల్ అహ్మద్,  యుజువేంద్ర చాహల్. 

Trending News