India vs Afghanistan Series: వచ్చే ఏడాది మార్చిలో టీమ్ఇండియాతో వన్డే సిరీస్ ఆడనున్నట్లు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనను జారీ చేసింది. అందులో 2022-23లో తమ జట్టు ఆడనున్న దైపాక్షిక సిరీస్ లకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించింది.
అఫ్గాన్ క్రికెట్ జట్టు.. రానున్న రెండేళ్ల కాలంలో 11 వన్డే, 4 టీ20, రెండు టెస్టు సిరీస్‌లు ఆడనుంది. అయితే, వచ్చే ఏడాది మార్చిలో భారత్‌లో కూడా పర్యటించనుంది. ఈ పర్యటనలో ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి.
"రానున్న రెండేళ్లలో 52 మ్యాచ్‌లకు గానూ 37 వన్డే, 12 టీ20, 3 టెస్టు మ్యాచ్‌లు ఆడుతుంది అఫ్గాన్ జట్టు. ఐసీసీ వన్డే సూపర్ లీగ్‌లో భాగంగా 7 వన్డే సిరీస్‌ల్లో పాల్గొంటుంది. వీటితో పాటు మేజర్ టోర్నీలైన ఆసియా కప్-2022 (టీ20 ఫార్మాట్), టీ20 ప్రపంచకప్-2022, ఆసియా కప్ 2023(వన్డే ఫార్మాట్), వన్డే ప్రపంచకప్‌లు ఆడుతుంది" అని అఫ్గాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
అయితే అఫ్గానిస్తాన్ జట్టు.. టీమ్ఇండియాతో పాటు నెదర్లాండ్స్, జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌తో వచ్చే ఏడాది ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడుతుందీ జట్టు. మొత్తంగా 18 మ్యాచ్‌లు స్వదేశంలో, 34 మ్యాచ్‌లు విదేశాల్లో ఆడేందుకు అఫ్గాన్ క్రికెట్ బోర్డు ప్రణాళికలు రూపొందించింది.
ALso Read: IND Vs SA Test Series: టీమ్ఇండియాతో టెస్టు సిరీస్ కు క్వింటన్ డికాక్ దూరం
Also Read: Kohli vs Rohit Rift: నీ కెప్టెన్సీలో నేనెందుకు ఆడుతా.. భారత జట్టులో మళ్లీ మొదలైన ఇగో ప్రాబ్లమ్స్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook