IND W vs AUS W Odi Match Highlights: నిర్ణయాత్మకమైన రెండో వన్డేలో భారత మహిళల జట్టు ఓటమిపాలైంది. మూడు వన్డేల సిరీస్‍లో భాగంగా.. ఆసీస్ తో జరిగిన రెండో మ్యాచ్‍లోనూ ఓడిపోయి.. సిరీస్‍ను చేజార్చుకుంది టీమిండియా. ముంబై వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో కేవలం 3 పరుగుల తేడాతో కంగారూ జట్టు చేతిలో ఓడిపోయింది భారత్ ఉమెన్స్ టీమ్. భారత బ్యాటర్ రిచా ఘోశ్ (96) చేసి పోరాటం వృథా అయింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‍కు దిగింది ఆస్ట్రేలియా వుమెన్స్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 258 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో ఓపెనర్ ఫోయెబ్ లిచ్‍ఫీల్డ్ (63), ఎలీస్ పెర్రీ (50) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ మ్యాచ్ లో భారత స్పిన్నర్ దీప్తి శర్మ ఐదు వికెట్లు తీసుకుంది.
అనంతరం 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 255 పరుగులు మాత్రమే చేసి.. మూడు రన్స్ తేడాతో ఓడిపోయింది. రిచా ఘోష్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి గెలిపించే ప్రయత్నం చేసింది. రిచా 117 బంతుల్లో 13 ఫోర్లతో మొత్తంగా 96 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (44), స్మృతి మంధాన (34) రాణించారు. అయితే చివర్లో దీప్తి శర్మ (24 నాటౌట్) మెరిసినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ కేవలం ఐదు పరుగులు చేసి ఔటైంది. ఆసీస్ బౌలర్లలో అనాబెల్ సదర్‌ల్యాండ్ మూడు, జార్జియా వెరెహామ్ రెండు వికెట్ల తీశారు. ఈ సిరీస్‍లో చివరిదైన మూడో వన్డే జనవరి 2న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది.
Also Read: 2023 Sports Events:2023లో మరచిపోని అద్భుతమైన స్పోర్ట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook