India vs West indies: భారత్‌, వెస్టిండీస్‌ రెండో టీ20 నేడే.. యశస్వి జైశ్వాల్‌కు చోటు దక్కనుందా?

India vs West indies: తొలి 20లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడిన టీమిండియా.. రెండో మ్యాచ్ లో గెలిచి సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో రెండో మ్యాచ్ కు రెడీ అయింది భారత్.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 6, 2023, 10:38 AM IST
India vs West indies: భారత్‌, వెస్టిండీస్‌ రెండో టీ20 నేడే.. యశస్వి జైశ్వాల్‌కు చోటు దక్కనుందా?

IND vs WI 2nd T20I: తొలి టీ20లో విండీస్‌ చేతిలో ఓటమి పాలైన టీమిండియా రెండో మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలన్న కసి మీద ఉంది. ఈ మ్యాచ్ లోనైనా భారత బ్యాటర్లు పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండో టీ20 మ్యాచ్ గయానా వేదికగా ఇవాళ జరగనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మెుదటి టీ20లో కేవలం నాలుగు పరుగుల తేడాతో ఓడిన హార్ధిక్ సేన.. రెండో టీ20లోనైనా బోణీ కొట్టాలని చూస్తోంది. టీ20ల్లో కరీబియన్ జట్టును ఓడించడం అంత సులువు కాదు. ఆ జట్టుకు నాణ్యమైన ఆల్ రౌండర్లు ఉన్నారు. భారత జట్టులో అనుభవ లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

తొలి మ్యాచ్ లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మంచి ప్రదర్శన చేశాడు. అతడు ఇదే ఫామ్ ను కొనసాగించాలని మేనెజ్ మెంట్ భావిస్తోంది. శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, సంజూశాంసన్‌ మంచి ప్రదర్శన చేయాలని కోరుకుంటోంది. ఈసారి ఓ స్పిన్నర్ ను తగ్గించి అతడి స్థానంలో యశస్వి జైస్వాల్ కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఆతిథ్య జట్టు సేమ్ టీమ్ నే కొనసాగించే అవకాశం ఉంది. గయానా పిచ్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింటికి సమానంగా సహకరించే అవకాశం ఉంది. 

భారత్‌ తుది జట్టు అంచనా: హార్దిక్‌ (కెప్టెన్‌), గిల్‌, ఇషాన్‌, యశస్వి, సూర్యకుమార్‌, తిలక్‌ వర్మ, శాంసన్‌, అక్షర్‌, కుల్దీప్‌/చాహల్‌, అర్ష్‌దీప్‌, ముఖేశ్‌.
వెస్టిండీస్‌ తుది జట్టు అంచనా: పావెల్‌ (కెప్టెన్‌), కింగ్‌, మయేర్స్‌, చార్లెస్‌, పూరన్‌, హెట్‌మైర్‌, హోల్డర్‌, షెఫర్డ్‌, అకీల్‌, జోసెఫ్‌, మెక్‌కాయ్‌.

Also Read: Hardik Pandya Emotional: కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఎమోషనల్.. భావోద్వేగంతో కన్నీళ్లు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News