IND vs WI: టీమిండియా చార్టెడ్ ఫ్లైట్ కోసం రూ. 3.5 కోట్ల ఖర్చు.. బీసీసీఐపై పేలుతున్న సెటైర్లు!

IND vs WI, BCCI spends Rs 3.5 crore for Indian Teams flight. ఇంగ్లండ్‌ నుంచి వెస్టిండీస్‌‌కు భారత ఆటగాళ్లను తీసుళ్లడానికి భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) ఏకంగా రూ. 3.5 కోట్ల ఖర్చు పెట్టిందట.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 21, 2022, 02:59 PM IST
  • చార్టెడ్ ఫ్లైట్ కోసం రూ. 3.5 కోట్ల ఖర్చు
  • బీసీసీఐపై పేలుతున్న సెటైర్లు
  • సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌
IND vs WI: టీమిండియా చార్టెడ్ ఫ్లైట్ కోసం రూ. 3.5 కోట్ల ఖర్చు.. బీసీసీఐపై పేలుతున్న సెటైర్లు!

BCCI spends Rs 3.5 crore for Team Indias chartered flight: ఇంగ్లండ్ గడ్డపై టీ20, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్.. నేరుగా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. ఇంగ్లండ్‌తో చివరిదైన వన్డే ముగిశాక 16 మంది ఆటగాళ్లతో కూడిన భారత బృందం చార్టెడ్ ఫ్లైట్‌లో విండీస్ చేరుకుంది. భారత జట్టు మాంచెస్టర్ నుంచి బయలుదేరి పోర్ట్ ఆఫ్ స్పెయిన్ (ట్రినిడాడ్‌)కు మంగళవారం చేరుకుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే సిరీస్‌కు దూరంగా ఉండటంతో.. వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. శుక్రవారం (జులై 22) మొదటి వన్డే జరగనుంది. 

అయితే ఇంగ్లండ్‌ నుంచి వెస్టిండీస్‌‌కు భారత ఆటగాళ్లను తీసుళ్లడానికి భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) ఏకంగా రూ. 3.5 కోట్ల ఖర్చు పెట్టిందట. చార్టర్డ్ ఫ్లైట్‌కు బీసీసీఐ ఇంత మొత్తం వెచ్చించింది. భారత ప్లేయర్స్ కమర్షియల్ ఫ్లైట్‌లో వెళితే.. ఈ ఖర్చు దాదాపు రూ. 2 కోట్లు మాత్రమే అయి ఉండేదట. క్రికెటర్స్ ఫ్యామిలీస్, సహాయక సిబ్బంది ఉండడం వల్లే చార్టర్డ్ ఫ్లైట్‌ బక్‌ చేయాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. దాంతో ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

'మాంచెస్టర్ నుంచి పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌కు టీమిండియా ఆటగాళ్లను తీసుకెళ్లిన చార్టర్డ్ ఫ్లైట్ కోసం బీసీసీఐ రూ. 3.5 కోట్లు ఖర్చు చేసింది. భారత ఆటగాళ్లతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉండడంతో చార్టర్డ్ ఫ్లైట్ బుక్‌ చేశాం. మాములుగా అయితే కమర్షియల్ ఫ్లైట్‌లో ఈ ఖర్చు దాదాపు రూ. 2 కోట్లు వరకు అయ్యేది. చార్టర్డ్ ఫ్లైట్ కోసం అదనంగా 1.5 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది' అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. దాంతో బీసీసీఐపై సెటైర్లు పేల్చుతున్నారు. ధనిక బోర్డు అయిన బీసీసీఐకి ఏం అవుతుంది లే, బీసీసీఐకి ఇది ఓ లెక్కా, ఇంకో 3.5 కోట్లు కూడా ఖర్చు పెడుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: IND vs ZIM: రోహిత్‌ శర్మ ఔట్.. టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్!

Also Read: Shadashtak Yog: త్వరలో శని-శుక్ర 'షడష్టక యోగం'.. ఈ 4 రాశులవారు జాగ్రత్త..!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News