Rohit Sharma about Avesh Khan: ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఓటమి చవిచూసింది. ఎడంచేతి వాటం పేసర్ ఒబెద్ మెకాయ్ నిప్పులు చెరగడంతో భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. మెకాయ్ సంచలన ప్రదర్శనతో (6/17) ఏకంగా ఆరు వికెట్లు తీసి టీమిండియాను 138 పరుగులకే కట్టడి చేశాడు. ఆపై 139 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 5 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. ఐదు టీ20ల సిరీస్‌లో భారత్, వెస్టిండీస్ చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి.
అయితే చివరి ఓవర్‌లో విండీస్ విజయం సాధించాలంటే 10 పరుగులు చేయాలి. ఆ సయమంలో కెప్టెన్ రోహిత్ శర్మ యువబౌలర్ అవేశ్ ఖాన్‌కు బంతిని ఇచ్చాడు. తీవ్ర ఒత్తిడి ఉన్న ఆ పరిస్థితుల్లో తొలి బంతిని అవేశ్ నో బాల్‌గా వేశాడు. తర్వాతి రెండు బంతుల్లో విండీస్ బ్యాటర్ డెవాన్ థామస్ సిక్స్, ఫోర్ బాదడడంతో విండీస్ విజయం సాధించింది. చివరి ఓవర్‌లో అవేశ్‌కు బదులు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు బౌలింగ్ ఇస్తే ఫలితం మరోలా ఉండేదేమోనని క్రీడా విశ్లేషకులు, అభిమానులు అన్నారు.ఈ విషయంపై రోహిత్ స్పందించాడు.
రోహిత్ శర్మ మాట్లాడుతూ... 'ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసి స్కోరు బోర్డుపై కావాల్సినన్ని పరుగులను ఉంచలేకపోయాం. పిచ్ బాగానే ఉన్నా.. మేం బాగా బ్యాటింగ్ చేయలేకపోయాం. బ్యాటింగ్‌లో ఎల్లప్పుడూ విజయవంతం కాలేం. ఒక్కోసారి ఇలా జరుగుతుంది. లోపాలను అధిగమించి పాఠాలను నేర్చుకుంటాం. తదుపరి మ్యాచుల్లో మా బ్యాటింగ్‌పై దృష్టిసారిస్తాం. ప్రతి ఒక్కరికి నేర్చుకునేందుకు అవకాశాలు వస్తుంటాయి. ఒక్క ఓటమితో మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఇపుడు మూడో మ్యాచుపై దృష్టి పెడతాం' అని అన్నాడు.
'చివరి ఓవర్ గురించి అందరూ చర్చిస్తారని తెలుసు. భువనేశ్వర్ కుమార్ అందుబాటులో ఉన్నప్పటికీ అవేశ్ ఖాన్‌కు బంతిని ఇచ్చా. డెత్ ఓవర్లలో యువ బౌలర్లకు అవకాశం ఇవ్వాలనే ఇలా చేశా. భువీ ఇన్ని సంవత్సరాలుగా ఏం చేశాడో మనకు తెలుసు. అవేష్, అర్ష్‌దీప్ లాంటి వాళ్లకు అవకాశాలు ఇస్తే.. వారు కూడా మెరుగవుతారు. కాస్త తడబాటుకు గురైనప్పటికీ అవేశ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇక 138 పరుగుల లక్ష్యాలను ఇలాంటి పిచ్‌పై 14 ఓవర్లలోపే ఛేదించే అవకాశం ఉన్నా.. మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకూ తీసుకెళ్ళాము. అందుకు సంతోషమే' అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
Also Read: Obed McCoy: నేను మా అమ్మ కోసం క్రికెట్ ఆడుతున్నా.. ఈ ప్రదర్శన ఆమెకే అంకితం: మెకాయ్
Also Read: Elachi Remedies for Money: ఇలాచీ పరిహారాలు.. ఇలా చేస్తే డబ్బే డబ్బు, మనీ కష్టాలన్నీ మాయం..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook