IND vs WI 2nd ODI: భారత్‌కు ఎదురుదెబ్బ.. రెండో వన్డేలో వెస్టిండీస్‌ ఘన విజయం

India vs West Indies: రెండో వన్డేలో భారత్ పై వెస్టిండీస్ విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ 1-1తో సమం అయింది. చివరిదైన మూడో వన్డే మంగళవారం జరగనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 30, 2023, 06:29 AM IST
IND vs WI 2nd ODI: భారత్‌కు ఎదురుదెబ్బ.. రెండో వన్డేలో వెస్టిండీస్‌ ఘన విజయం

India vs West Indies Highlights, 2nd ODI: విండీస్ పర్యటనలో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. శనివారం జరిగిన రెండో వన్డేలో భారత్ పై వెస్టిండీస్ టీమ్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం అయింది. ఈ రెండు జట్ల (India vs West Indies) మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే మంగళవారం (ఆగస్టు 01)న జరగనుంది. 

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్ గిల్  మెరుపు ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 90 పరుగలు పార్టనర్ షిప్ అందించారు. అప్పుడు మెుదలైంది అసలు డ్రామా. ఇషాన్‌ కిషన్‌ (55), శుభ్‌మన్‌ గిల్ (34) ఔటయ్యిన తర్వాత మిగతా 91 పరుగుల వ్యవధిలో 10 వికెట్లు కోల్పోయి 181 పరుగులకే ఆలౌటైంది.  అక్షర్‌ పటేల్‌ (1), సంజు శాంసన్‌ (9),  కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (7) సింగిల్ డిజిట్స్ కు పరిమితమయ్యారు. 

భారత్ 5 వికెట్లు చేజార్చుకుని 113 పరుగుల చేసిన సమయంలో మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా వికెట్ల పతనం ఆగలేదు. జడేజా, సూర్యకుమార్ స్వల్ప స్కోర్లుకే వెనుదిరిగారు. అనంతరం కొద్దిసేపు నిలకడగా ఆడిన శార్దూల్ ఠాకూర్ 16 పరుగులు చేసి ఔటయ్యారు. ఉమ్రాన్ మాలిక్ డకౌట్ కాగా.. ముకేశ్ కుమార్ ఆరు పరుగులు చేసి పెవిలియన్ చేరారు. కరేబియన్ జట్టు బౌలర్లలో రొమారియో షెఫర్డ్ 3, మోతీ 3, జోసెఫ్‌ 2, సీల్స్‌, కరియా ఒక్కో వికెట్ తీశారు. 

Also Read: Superstar Rajinikanth: కావ్య మారన్‌ని అలా చూస్తుంటే బాధగా ఉంది.. మంచి ప్లేయర్లను తీసుకో: రజనీకాంత్

అనంతరం 182 పరుగుల లక్ష్యాన్ని విండీస్ జట్టు 36.4  ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆతిథ్య జట్టు బ్యాటర్లలో షై హోప్ (63*; 80 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేశాడు. కార్టీ (48*; 65 బంతుల్లో 4 ఫోర్లు),  కైల్ మేయర్స్‌ (36) కూడా రాణించారు. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, కుల్‌దీప్ యాదవ్‌ ఒక వికెట్ పడగొట్టారు.

Also Read: T20 world cup 2024: ఈ సారి టీ20 వరల్డ్‌ కప్‌లో 20 జట్లు.. మెగా టోర్నీ ప్రారంభం ఎప్పుడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News