FIH Hockey World Cup 2023: హాకీ ప్రపంచ కప్‌లో టీమిండియా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 4-2 తేడాతో వేల్స్‌ను ఓడించింది. మ్యాచ్ తొలి అర్ధభాగంలోనే ఆధిక్యం సాధించి వేల్స్ జట్టుపై భారత జట్టు ఒత్తిడి పెంచింది. మ్యాచ్ 21వ నిమిషంలో షంషేర్ సింగ్ టీమ్ ఇండియాకు తొలి గోల్ చేశాడు. ఆకాశ్‌దీప్ సింగ్ మ్యాచ్‌లో అద్భుతమైన ఆటను కనబరుస్తూ.. 32వ, 45వ నిమిషాల్లో రెండు గొప్ప గోల్స్ చేశాడు. హర్మన్‌ప్రీత్ సింగ్ మరో గోల్ కొట్టాడు.
మూడో మ్యాచ్‌లో వేల్స్‌తో టీమిండియా తలపడింది. భారత్ నుంచి షంషేర్ సింగ్ 21వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌లో అద్భుతమైన గోల్ చేశాడు. పెనాల్టీ కార్నర్‌లో షంషేర్ సింగ్ కొట్టిన షాట్‌ను వేల్స్ గోల్ కీపర్ ఆపలేకపోయాడు. హాఫ్ టైమ్ ముగిసిన తర్వాత మ్యాచ్ 32వ నిమిషంలో భారత్‌కు రెండో గోల్ వచ్చింది. ఆకాశ్‌దీప్ సింగ్ జట్టుకు రెండో గోల్ చేశాడు.
ఇక్కడితో ఆగని ఆకాశ్‌దీప్.. మ్యాచ్ 45వ నిమిషంలో మరో గోల్ చేసి జట్టుకు భారీ ఆధిక్యాన్ని అందించాడు. యాచ్ 59వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. అతను పెనాల్టీ ద్వారా నాల్గో గోల్ చేశాడు.
వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచినా.. టీమిండియా నేరుగా ప్రపంచ కప్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోలేదు. నేరుగా క్వార్టర్ ఫైనల్ చేరాలంటే భారత్ 8-0తో వేల్స్‌ను ఓడించాల్సింది. 4-2 గోల్స్ తేడా గెలవడంతో పుల్ డీలో అగ్రస్థానం ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. దీంతో టీమిండియా రెండోస్థానికి పరిమితమైంది. గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌లో చోటు సంపాదించుకుంది. భారత్ క్వార్టర్ ఫైనల్ చేరాలంటే.. మూడోస్థానంలో ఉన్న జట్టుతో క్రాస్ ఓవర్ ఆడాల్సి ఉంటుంది.
Also Read: Maharashtra Road Accident: మహారాష్ట్రలో రెండు ఘోర ప్రమాదాలు.. 13 మంది మృతి
Also Read: Hardik Pandya: థర్డ్ అంపైర్ కళ్లు మూసుకున్నారా..? పాండ్యా ఔట్‌పై వివాదం.. ఇషాన్ కిషన్ రివేంజ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి