Ind Vs SL 2nd Odi Preview: భారత్-శ్రీలంక మధ్య వన్డే సిరీస్‌లో భాగంగా గురువారం కోల్‌కతా ఈడెన్ గార్డెన్ వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన టీమిండియా.. రెండో వన్డేలోనూ గెలుపొంది సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కాబోతుంది. ఇక భారత్ తుది జట్టులో మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సూర్యకుమార్ యాదవ్‌కు మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆకట్టుకున్న టీమిండియా.. అదే ప్రదర్శనను రిపీట్ చేయాలని చూస్తోంది.
గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ.. తొలి వన్డేలో అదరగొట్టాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. హిట్‌మ్యాన్‌కు ఫేవరెట్ గ్రౌండ్ కావడంతో భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉంది. వీరిద్దరు జట్టుకు మరోసారి మంచి ఆరంభాన్ని ఇస్తే భారత్ గెలుపు సులువు అవుతుంది. వన్‌డౌన్ రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ ఒంటిచెత్తో మ్యాచ్‌ను గెలిపించేందుకు రెడీగా ఉన్నారు. తొలి మ్యాచ్‌లో కెరీర్లో 45 సెంచరీ అందుకున్న కింగ్ కోహ్లీపై అందరి కళ్లు ఉన్నాయి. మిడిల్ ఆర్డర్ కాస్త పుంజుకోవాల్సిన అవసరం ఉంది.
ముఖ్యంగా తొలి వన్డేలో పెద్దగా రాణించలేకపోయిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా.. ఈ మ్యాచ్‌లో కుదురుకోవాల్సిన అవసరం ఉంది. టాప్ ఆర్డర్ విఫలమైతే.. భారం మోయాల్సింది ఈ ముగ్గురు ప్లేయర్లే. రెండో మ్యాచ్‌లో ఎలా ఆడతారో చూడాలి మరి. ఇక ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా సెట్ అవ్వాల్సి ఉంది. పేస్ త్రయం సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, షమీకి తోడు స్పిన్నర్ చాహల్ మరోసారి శ్రీలంక బ్యాట్స్‌మెన్‌కు చెమటలు పట్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన శ్రీలంక.. రెండో వన్డేలో గెలిచి సిరీస్ సమం చేయాలని చూస్తోంది. ఆ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ కలవర పెడుతోంది. ఓపెనర్ నిస్సంకా, కెప్టెన్ దసున్ శానక మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ పెద్దగా ఆడట్లేదు. ముఖ్యంగా శానకపైనే ఆ జట్టు ఆశలన్నీ పెట్టుకుంది. ఈ ప్లేయర్‌ను టీమిండియా బౌలర్లు ఆపితే.. గెలుపుపై శ్రీలంక ఆశలు వదులుకోవాల్సిందే.
Also Read: Prabhas Craze: ఏమాత్రం తగ్గని ప్రభాస్ క్రేజ్.. ఏడాది మొత్తం అదే హవా!
Also Read: Chiranjeevi Vs Balakrishna: 9 సార్లు సంక్రాంతికి బాలయ్య-చిరు పోటీ.. ఎవరెన్ని హిట్లు కొట్టారంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook