Virat Kohli - DRS: విరాట్ కోహ్లీ ఆ ధ్యాసలో పడి.. మ్యాచ్‌ గురించి మర్చిపోయాడు: డీన్‌ ఎల్గర్‌

సిరీస్‌ డిసైడర్ అయిన మూడో టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు భారత ఆటగాళ్లు అందరూ నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్‌ఎస్‌) గురించే ఆలోచిస్తూ.. మ్యాచ్ గురించి మర్చిపోయారని దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ అన్నాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 16, 2022, 08:23 AM IST
  • భారత ఆటగాళ్లు అసహనానికి గురయ్యారు
  • విరాట్ కోహ్లీ ఆ ధ్యాసలోనే ఉన్నాడు
  • భారత్ మ్యాచ్‌ గురించి మారిపోయింది
 Virat Kohli - DRS: విరాట్ కోహ్లీ ఆ ధ్యాసలో పడి.. మ్యాచ్‌ గురించి మర్చిపోయాడు: డీన్‌ ఎల్గర్‌

Dean Elgar says Virat Kohli think DRS and forgot about the Match: సిరీస్‌ డిసైడర్ అయిన మూడో టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)తో పాటు భారత ఆటగాళ్లు అందరూ నిర్ణయ సమీక్ష పద్ధతి (DRS) గురించే ఆలోచిస్తూ.. మ్యాచ్ గురించి మర్చిపోయారని దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ (Dean Elgar) అన్నాడు. అది తమకు కలిసొచ్చిందని, మరింత స్వేచ్చగా ఆడేందుకు సహయపడిందన్నాడు. టీమిండియా లాంటి బలమైన జట్టుపై విజయం సాధించినందుకు చాలా గర్వంగా ఉందని ఎల్గర్‌ తెలిపాడు. కేప్‌టౌన్ టెస్టులో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. దాంతో 2-1 తేడాతో ప్రొటీస్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ మాట్లాడుతూ... 'మూడో టెస్టులో భారత్ ఒత్తిడికి గురైంది. రెండో ఇన్నింగ్స్‌ ఆరంభంలో వికెట్లు దక్కకపోవడమే అందుకు కారణం. రివ్యూలో నేను నాటౌట్ అని తేలడంతో భారత ఆటగాళ్లు మరింత అసహనానికి గురయ్యారు. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో ఆవేశంగా కనిపించాడు. అందరూ డీఆర్‌ఎస్ గురించి ఆలోచిస్తూ.. మ్యాచ్‌ గురించి మర్చిపోయారు. ఆ అవకాశాన్ని మేం చక్కగా సద్వినియోగం చేసుకున్నాం. నిలకడగా రాణిస్తూ విజయం సాధించాం. టీమిండియా లాంటి బలమైన జట్టుపై విజయం సాధించినందుకు చాలా గర్వంగా ఉంది' అని అన్నాడు. 

Also Read: Horoscope Today: 16-01-2022 ఆదివారం.. మీ రాశి ఫలాలు! వారు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది!

'ఈ సిరీస్‌లో చాలా సార్లు ఒత్తిడికి గురైనా.. మా కుర్రాళ్లు గొప్పగా పుంజుకున్నారు. ఈ విజయంతో వారిలో ఏ జట్టుపై అయినా గెలవగలమనే నమ్మకం పెరిగింది. సమష్టిగా రాణించడంతోనే ఈ విజయం సాధ్యమైంది. కీగన్‌ పీటర్సన్‌ గొప్పగా రాణించాడు. సిరీస్ సాధించినంత మాత్రాన మా జట్టులో లోపాలు ఏం లేవని చెప్పలేం. రాబోయే సిరీస్‌ల్లో వాటిని అధిగమిస్తాం. ఆటలో స్లెడ్జింగ్ సహజమే. ప్రతి ఒక్క ఆటగాడితో పరస్పర గౌరవాన్ని కలిగి ఉండాలి. జట్టులో జరిగేది జట్టులోనే ఉంటుంది కాబట్టి ప్రతిదీ బహిర్గతం చేయబోవడం లేదు. జట్టుగా ముందుకు సాగడమే ముఖ్యం' అని చెప్పుకొచ్చాడు. 

మూడో టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (R Ashwin) వేసిన 21వ ఓవర్లో డీన్‌ ఎల్గర్‌ ఎల్బీడబ్ల్యూ (Dean Elgar LBW) కోసం భారత్ అప్పీల్‌ చేసింది. ఫీల్డ్‌ అంపైర్‌ ఎరాస్మస్‌ ఔటిచ్చాడు. అయితే అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. ఎల్గర్‌ రివ్యూ తీసుకున్నాడు. సమీక్షలో బంతి గమనాన్ని బట్టి ఔట్ అని భావించిన ఎల్గర్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. బంతి వికెట్లపై నుంచి వెళ్తున్నట్లు తేలడంతో మళ్లీ బ్యాటింగ్‌ కొనసాగించాడు. ఈ నిర్ణయంపై విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. వికెట్ల దగ్గరకు వెళ్లి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

Also Read: Team India Test Captain: కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే టెస్టు కెప్టెన్​ ఎవరంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News