Jasprit Bumrah picks 6 wickets, England all out for 110 runs: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పలు చెరిగాడు. ఏకంగా ఆరు వికెట్లతో ఇంగ్లీష్ జట్టును బూమ్ బూమ్ బుమ్రా వణికించాడు. ఈ క్రమంలోనే కెరీర్ బెస్ట్ గణాంకాలు (6/19) నమోదు చేశాడు. బుమ్రా సహా మొహ్మద్ షమీ మూడు వికెట్లతో చెలరేగడంతో.. తొలి వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 25.2 ఓవర్లలో 110 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీమిండియా ముందు 111 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టుకు జస్ప్రీత్ బుమ్రా భారీ షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే జేసన్ రాయ్ (0), జో రూట్ (0) ఇద్దరినీ పెవిలియన్ చేర్చాడు. మరుసటి ఓవర్లోనే బెన్ స్టోక్స్ (0)ను మొహ్మద్ షమీ డకౌట్ చేశాడు. కాసేపటికే సెంచరీ హీరో జానీ బెయిర్‌స్టో (7)ను బుమ్రా అవుట్ చేశాడు. ఆ వెంటనే బిగ్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టన్ (0)ను కూడా బౌల్డ్ చేశాడు. దీంతో 27 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ సమయంలో కెప్టెన్ జోస్ బట్లర్ (30), మొయీన్ అలీ (14) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే ఈ జోడీని ప్రసిద్ధ్ కృష్ణ విడగొట్టాడు. అలీని అవుట్ అయిన కాసేపటికే బట్లర్‌ను షమీ వెనక్కి పంపాడు. చివర్లో డేవిడ్ విల్లే (21), బ్రైడన్ కార్సె (15) కాసేపు పోరాడారు. మరోసారి బంతి అందుకున్న బుమ్రా.. కార్సేను బౌల్డ్ చేశాడు. ఆపై విల్లే కూడా క్లీన్ బౌల్డ్ అవ్వడంతో ఇంగ్లీష్ జట్టు తక్కువ పరుగులకే చాపచుట్టేసింది. ఇంగ్లండ్ 25.2 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌట్ అయింది.
BOOM BOOM 💥💥
Jasprit Bumrah has been at it from the word go and he registers his second 5-wicket haul in ODIs.
Live - https://t.co/8E3nGmlfYJ #ENGvIND pic.twitter.com/x9uKAuyFvS
— BCCI (@BCCI) July 12, 2022
జస్ప్రీత్ బుమ్రా తన కెరీర్‌లోనే బెస్ట్ వన్డే బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. బుమ్రా 19 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. మొహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ధ్ కృష్ణ ఒక వికెట్ తీసుకున్నాడు. పెసర్లే చెలరేగడంతో టీమిండియాకు స్పిన్నర్ అవసరం లేకుండా పోయింది.
Also Read: ఒక మనిషిని పట్టుకుని వేలాడే ప్రేమ కంటే.. స్వేచ్ఛగా వదిలేయగల ప్రేమే ఎంతో గొప్పది: నాగ చైతన్య
Also Read: మహిళకు ముద్దులు, హగ్గులు ఇచ్చిన రెండు సింహాలు.. వీడియో చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook