Ind vs Eng: ముగిసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్.. ఎంత స్కోరు చేసిందంటే?

Ind vs Eng: మూడో టెస్టులో భారత్ భారీ స్కోరు సాధించింది. రోహిత్, జడేజా సెంచరీలకు.. సర్పరాజ్, ధ్రువ్ విలువైన ఇన్నింగ్స్ తోడవ్వడంతో టీమిండియా నాలుగు వందలకుపైగా పరుగులు చేసింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 16, 2024, 02:53 PM IST
Ind vs Eng: ముగిసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్..  ఎంత స్కోరు చేసిందంటే?

Rajkot test live: రాజ్‌కోట్ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. రోహిత్ సేన 130.5 ఓవర్లలో 445 పరుగులకు ఆలౌట్ అయింది.  తొలి మ్యాచ్ ఆడుతున్న  ధ్రువ్ జురెల్(Dhruv Jurel) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ యువ ఆటగాడు ఆల్‌రౌండ‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్‌(R Ashwin)తో క‌లిసి టీమిండియా స్కోరును 400 దాటించాడు. హాఫ్ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో పెవిలియన్ చేరాడు. సెలెక్ట‌ర్లు త‌న‌పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టాడు ధ్రువ్. ఈ మ్యాచ్ ద్వారా ఈ యంగ్ స్టర్ కొన్ని రికార్డులను నెలకొల్పాడు. 

రికార్డులు బ్రేక్ చేసిన జురెల్..
అరంగేట్రం మ్యాచ్ ఒక ఇన్నింగ్స్‌లో మూడు సిక్స‌ర్లు కొట్టిన రెండో భార‌త ఆట‌గాడిగా జురెల్ రికార్డు నెల‌కొల్పాడు. 2017లో శ్రీ‌లంక‌పై హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) మూడు సిక్సర్లు బాదాడు. తొలి మ్యాచ్ లోనే అత్య‌ధిక ప‌రుగులు చేసిన మూడో వికెట్‌కీప‌ర్‌గా జురెల్ మరో రికార్డు సాధించాడు. ఈ జాబితాలో కేఎల్ రాహుల్(KL Rahul) 101 ర‌న్స్‌తో అగ్ర‌స్థానంలో ఉండగా.. దిల్వార్ హుసేన్ 59 ప‌రుగుల‌తో రెండో స్థానంలో నిలిచాడు. 

Also read: Ravindra Jadeja Rare Feat: రాజ్‌కోట్‌ టెస్టులో చరిత్ర సృష్టించిన జడ్డూ.. దిగ్గజాల సరసన చోటు..

కేవలం 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల అనుభ‌వ‌మే ఉన్న జురెల్.. రాజ్‌కోట్‌లో అండ‌ర్స‌న్, మార్క్ వుడ్ వంటి పేస‌ర్ల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కోని పరుగులు రాబట్టాడు. 331 ప‌రుగుల వద్ద క్రీజులోకి వ‌చ్చిన జురెల్ .. అశ్విన్‌తో క‌లిసి ఎనిమిదో వికెట్‌కు 77 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పాడు. ద్రువ్ 46 పరుగులు, అశ్విన్ 37, బుమ్రా 26 పరుగులు చేశారు. ఇంగ్లీష్ బౌలర్లలో మార్క్ వుడ్ నాలుగు వికెట్లు తీయగా.. రెహ్మాన్ అహ్మాద్ రెండు వికెట్లు పడగొట్టాడు. 

Also Read: IND vs ENG 3rd Test: రోహిత్‌, జడేజా సెంచరీలు..ఆరంగ్రేటంలోనే అదరగొట్టిన సర్ఫరాజ్‌.. తొలి రోజు టీమిండియాదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News