IND vs AUS: ఉప్పల్ స్టేడియంలో టీమిండియా ఎన్ని విజయాలు సాధించిందో తెలుసా..?

IND vs AUS: ఉప్పల్ స్టేడియం వేదికగా ఇవాళ భారత-ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈనేపథ్యంలో ఉప్పల్‌లో టీమిండియా ఎన్ని విజయాలు సాధించిందో ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - Alla Swamy | Last Updated : Sep 25, 2022, 04:41 PM IST
  • ఇవాళ ఉప్పల్‌లో ఫైట్
  • మ్యాచ్‌పై ఉత్కంఠ
  • సా. 7 గంటలకు ప్రారంభం
IND vs AUS: ఉప్పల్ స్టేడియంలో టీమిండియా ఎన్ని విజయాలు సాధించిందో తెలుసా..?

IND vs AUS: ఉప్పల్ వేదికగా ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. మూడు టీ20ల సిరీస్‌లో భారత్-ఆస్ట్రేలియా జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. దీంతో ఇవాళ్టి మ్యాచ్ నిర్ణయాత్మకంగా మారింది. మరోవైపు మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం అతిథ్యం ఇస్తోంది. ఇవాళ సాయంత్రం 7 గంటలకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. నిజానికి ఉప్పల్ స్టేడియం నిర్మాణ పనులు 2003లో ప్రారంభమయ్యాయి. 

మైదానం సిటింగ్ కెపాసిటీ 55 వేలుగా ఉంది. 2005లో గ్రౌండ్ నిర్మాణం పూర్తైంది. మొదట్లో స్టేడియానికి విశాఖ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంగా నామకరణం చేశారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి..రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంగా పేరు మార్చారు. ఉప్పల్‌లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ 2005లో జరిగింది. ఆ ఏడాది నవంబర్ 16న భారత్, సౌతాఫ్రికా మధ్య వన్డే మ్యాచ్‌ కు హైదరాబాద్ వేదికైంది. ఈమ్యాచ్‌లో యువరాజ్ సింగ్ 122 బంతుల్లో 103 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఐతే ఈమ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. 

ఇప్పటివరకు ఇక్కడ రెండు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు జరిగాయి. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ జయభేరీ మోగించింది. మరో మ్యాచ్‌ ఆస్ట్రేలియాతో జరగాల్సి ఉంది. ఐతే వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ రద్దు అయ్యింది. ఇవాళ్టి మ్యాచ్‌కు సైతం వరుణ గండం ఉందని తెలుస్తోంది. ఈమేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మొత్తంగా ఉప్పల్ స్టేడియంలో భారత్‌కు తిరుగు ఉండదని క్రికెట్ పండితులు చెబుతున్నారు. 

Also read:GVL Narasimha Rao: ఎన్టీఆర్‌ను బీజేపీ ఓన్ చేసుకుంటోందా..జీవీఎల్ ఆసక్తికర ట్వీట్..!

Also read:Rape Incident: తెలంగాణలో మరో గ్యాంగ్ రేప్ ఘటన..మత్తు మందు ఇచ్చి దారుణం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News