సిడ్నీ: ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు సిడ్నీ స్టేడియం వేదికగా జరిగిన ఆఖరి 3వ వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ని సమం చేసింది. సిరీస్‌లో మొదటి మ్యాచ్ గెల్చుకున్న సిరీస్ 1-0 ఆధిక్యం కనబరుస్తూ వచ్చింది. రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో నేడు ఆడిన ఆఖరి మ్యాచ్‌లో భారత్ చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేటి మ్యాచ్ ఓడిపోతే, సిరీస్ కాస్తా ఆసిస్ వశం కానుండటంతో ఆఖరి టీ20 మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే, 61 పరుగులతో కెప్టేన్ విరాట్ కోహ్లీ (నాటౌట్) ఆడిన బాధ్యాతయుతమైన ఇన్నింగ్స్, శిఖర్ ధవన్ రాబట్టిన 41 పరుగులు, రోహిత్ శర్మ చేసిన 23 పరుగులకుతోడు భారత బౌలర్ కృనాల్ పాండ్య బంతి చేసిన మేజిక్ ఫలితంగా భారత జట్టు 6 వికెట్ల నష్టానికి నిర్ణీత 20 ఓవర్లకు మరో రెండు బంతులు మిగిలివుండగానే విజయం సాధించింది.
నలుగురు ఆసిస్ ఆటగాళ్లను పెవిలియన్ బాట పట్టించిన కృనాల్ పాండ్యకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.