IND vs AFG 1st T20I Live Updates: మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో అఫ్గానిస్తాన్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు టీమిండియా బౌలర్లు. అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టు ఆటగాళ్లలో సీనియర్ బ్యాటర్ మహ్మద్ నబీ (27 బంతుల్లో 42, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. భారత బౌలర్లలో ముకేష్ కుమార్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు.
తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. మెుదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్‌కు మంచి శుభారంభం దక్కింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ (28 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్), ఇబ్రహీం జద్రాన్ (22 బంతుల్లో 25, 2 ఫోర్లు, 1 సిక్సర్) లు తొలి వికెట్‌కు 50 పరుగులు పార్టనర్ షిప్ నమోదు చేశారు. అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని అక్షర్ పటేల్ విడదీశాడు. అక్షర్ బౌలింగ్ లో గుర్బాజ్ స్టంపౌట్ అయ్యాడు. మరుసటి ఓవర్లో జద్రాన్‌ను శివమ్ దూబే ఔట్ చేశాడు. అక్షర్ వేసిన తర్వాతి ఓవర్ లో రహ్మత్ షా (3) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన సీనియర్ బ్యాటర్ నబీ జట్టును ఆదుకున్నాడు. అజ్మతుల్లాతో కలిసి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. బిష్ణోయ్ వేసిన 15వ ఓవర్లో అఫ్గాన్ జట్టు 16 పరుగులు పిండుకుంది. దీంతో ఆ జట్టు స్కోరు వంద పరుగులు దాటింది. ముకేష్ వేసిన 16వ ఓవర్ లో నబీ రెండు సిక్సర్లు దంచాడు. ముకేష్ తన 18వ ఓవర్ తొలి బంతికి అజ్మతుల్లాను ఔట్ చేశాడు. ఇదే ఓవర్లో చివరి బంతికి నబీ కూడాక్యాచ్ ఔటయ్యాడు. వీరిద్దరి ఔటైనా చివరి రెండు ఓవరల్లో బాగానే స్కోరు చేశారు అఫ్గాన్ బ్యాటర్లు. మెుత్తంగా 158 పరుగులు చేసింది.
Also Read: IND Vs AFG 1st T20 Updates: తొలి టీ20లో టాస్ గెలిచిన భారత్.. ఆ ప్లేయర్లు బెంచ్‌కే..!
తుది జట్లు ఇవే..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్
అఫ్గానిస్థాన్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహమత్ షా, అజ్మతుల్లా ఒమర్జాయ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, కరీం జనత్, ఫజల్హక్ ఫరూకీ, నవీన్-ఉల్-జీబ్ రహ్మాన్.
Also Read: Dinesh Karthik: ఇంగ్లాండ్ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా దినేశ్ కార్తీక్.. తొలి సవాల్ మనతోనే...!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి