టీ20ల్లో భారత్ హవా: రోహిత్, ధోని అరుదైన రికార్డులు

బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో భార‌త్ వ‌ర్సెస్ ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య జరిగిన చివరి మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్ జ‌ట్టుపై భార‌త్ 7 వికెట్ల తేడాతో గెలిచి టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే..!

Last Updated : Jul 9, 2018, 11:59 AM IST
టీ20ల్లో భారత్ హవా: రోహిత్, ధోని అరుదైన రికార్డులు

బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో భార‌త్ వ‌ర్సెస్ ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య జరిగిన చివరి మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్ జ‌ట్టుపై భార‌త్ 7 వికెట్ల తేడాతో గెలిచి టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే..! చివరి మ్యాచ్‌లో భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ చెలరేగి ఆడి జట్టును గెలుపు దిశగా మళ్లించారు. జట్టు గెలుపులో రోహిత్ పాత్ర కీలకం. 56 బంతుల్లో 5 సిక్సర్లు, 11 ఫోర్లతో సెంచరీ (నాటౌట్) పూర్తి చేసి బాధ్యతాయుతమైన విజయాన్ని అందించాడు రోహిత్. అటు టీ20 మ్యాచ్‌లలో రోహిత్ శర్మ మూడు సెంచరీలు చేసి రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టీ20లలో మన్రో తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడు, ఏకైక భారత క్రికెటర్ రోహితే. రోహిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ దక్కాయి.

టీ20ల్లో భారత్ హవా

ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టీ20లో గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా అరుదైన మైలురాళ్లను దాటింది. గత ఆరు టీ20 సిరీస్‌లలో వరుసగా గెలిచిన జట్టుగా విరాట్ సేన నిలిచింది. దీంతో పాటు గత రెండున్నరేళ్ల కాలంలో 8 మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లు ఆడిన భారత్.. అన్నింట్లో గెలిచింది. కాగా తాజా విజయంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా రెండో స్థానానికి చేరుకుంది.

ఒక్క మ్యాచ్‌లో మూడు రికార్డులను నమోదు చేసిన ధోని

'ఓ టీ20లో 5 క్యాచ్‌లు పట్టిన ఏకైక క్రికెటర్'గా మహేంద్ర సింగ్ ధోని నిలిచాడు. ఇంగ్లండ్‌తో మూడో టీ20లో ధోని ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు.  మిస్టర్ కూల్ తర్వాత మహమ్మద్ షాజాద్(3)ఉన్నాడు. కాగా వికెట్ కీపర్‌గా టీ20లో 50కి పైగా క్యాచ్‌లను పట్టిన (54) క్రికెటర్‌గానూ, టీ20లో అత్యధిక స్టంపింగులు(33) చేసిన ఏకైక వికెట్ కీపర్‌గా జార్ఖండ్ డైనమైట్ ఈ మ్యాచ్‌లో రికార్డులు నెలకొల్పాడు. ఒక మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌ల రికార్డూ అతడిదే.

ఇది 'పార్టీ' టైమ్: విరాట్

ఇంగ్లండ్‌తో చివరి టీ20 విజయాన్ని ఆస్వాదిస్తున్నామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తెలిపాడు. 'ఇది మాకు పార్టీ చేసుకునే సమయం. ఇది సమిష్టి విజయం. జట్టులోని ఆటగాళ్లు అంతా తమ సత్తాను చూపించారు.ఇలాంటి జట్టుతో ఈ సిరీస్ విజయం తృప్తినిచ్చింది. పాండ్యా ఆల్‌రౌండ్ షో, రోహిత్ సూపర్ బ్యాటింగ్ విజయానికి ప్రధాన కారణంగా మారింది' అని తెలిపాడు.

Trending News