టీ20ల్లో రైనా అరుదైన "సిక్సర్ల" రికార్డు..!

టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

Last Updated : Mar 9, 2018, 02:07 PM IST
టీ20ల్లో రైనా అరుదైన "సిక్సర్ల" రికార్డు..!

టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో తాను బాదిన సిక్సర్‌తో.. అంతర్జాతీయ టీ20ల్లో 50 సిక్సులు పూర్తి చేసుకొని వార్తల్లో నిలిచాడు. ఇప్పటికే టీ20ల్లో అత్యధిక సిక్సర్‌లు బాదిన మూడో ఆటగాడిగా రికార్డు నమోదు చేసిన రైనా.. తాజా సిక్సర్‌తో 50 సిక్సర్‌లు కొట్టిన ఘనతను సాధించాడు.

ఇప్పటికే ఇండియన్ బ్యాట్స్‌మన్లలో 74 సిక్సర్‌లతో యువరాజ్ సింగ్ తొలిస్థానంలో ఉండగా.. 69 సిక్సర్‌లతో రోహిత్ శర్మ రెండవ స్థానంలో ఉన్నాడు.  ఇక ప్రపంచ జాబితాని చూస్తే.. క్రిస్ గేల్, మార్టిన్ గప్టిల్‌లు 103 సిక్సర్లతో టాప్ లిస్టులో కొనసాగుతున్నారు. వారి తర్వాతి స్థానాల్లో 91 సిక్సర్లతో మెకల్లమ్, 83 సిక్సర్లతో ఎస్ ఆర్ వాట్సన్‌లు లిస్టులో కొనసాగుతున్నారు

Trending News